శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
close

తాజా వార్తలు

Published : 06/02/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అలిపిరి మెట్ల మార్గం కిటకిటలాడింది. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత దశలవారీగా టోకెన్ల సంఖ్య పెంచుతూ వస్తున్న తితిదే.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి రెండు గంటల వరకు అలిపిరి నుంచి, ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీవారి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకునేందుకు భక్తులకు అనుమతిస్తోంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని