close

తాజా వార్తలు

Updated : 13/04/2021 09:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విడాకులిచ్చినా.. మృగంలా వెంటాడుతున్నాడు’

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తన భర్త పెట్టే వేధింపులు భరించ లేక..అతని నుంచి విడాకులు తీసుకుంటే..ఆయన మృగంగా మారి ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్‌ ఫొటోలు పెడుతూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని బాధిత యువతి తన తల్లిదండ్రులతో కలసి సోమవారం జరిగిన స్పందనలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డిని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వెంటనే చర్యలు తీసుకొని యువతికి న్యాయం చేయాలని ఆదేశించారు. బాధిత యువతి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....
గుంటూరుకు చెందిన ఆ యువతి ఇంటర్‌ చదువుకున్నారు. పాతగుంటూరుకు చెందిన యువకుడితో 2019లో పెద్దల సమక్షంలో కట్నకానుకలతోపాటు హంగు ఆర్బాటాలతో వివాహం చేశారు. చెడు సావాసాలకు అలవాటుపడిన అతడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దల సమక్షంలో పలుమార్లు సర్ది చెప్పారు. అయినా అతని తీరులో మార్పురాక భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె మతపెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అతను శాడిస్టులా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి అసభ్యకరమైన ఈ అమ్మాయి కావాలంటే సంప్రదించండంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె తండ్రి, సోదరుడి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నాడు. ఆమెకు అర్ధరాత్రిళ్లు ఫోన్‌లు చేసి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెట్టుకొని తమ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. తన వద్ద నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని