చోరీకి యత్నించి.. రేకుల మధ్యలో ఇరుక్కొని..
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చోరీకి యత్నించి.. రేకుల మధ్యలో ఇరుక్కొని..

చోరీకి యత్నిస్తూ మధ్యలో ఇరుక్కుపోయిన రఘు

నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగరంలోని ముబారక్‌నగర్‌ మహాలక్ష్మి ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చిన యువకుడు రేకుల మధ్యలో ఇరుక్కొని పోలీసులకు చిక్కిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లాకు చెందిన రఘు ఉపాధి కోసం ఆర్మూర్‌లోని మామిడిపల్లికి వచ్చి నివసిస్తున్నారు. బుధవారం నగర శివారులోని మహాలక్ష్మి ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చాడు. రేకుల మధ్యలో నుంచి దూరేందుకు సిద్ధమై మధ్యలో ఇరుకున్నాడు. ఊపిరాడని పరిస్థితిలో పైన రేకులు, ఇనుప చువ్వల మధ్యలో విలవిలలాడుతుండగా ఆలయానికి ఎదురుగా ఉన్న సుఖ్‌జిత్‌ మిల్‌ కాపలదారుడు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని బయటకు తీసి అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని