close

తాజా వార్తలు

Updated : 10/05/2021 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాళం మరిచిన యజమాని.. కారు మాయం!

కారు చోరీ చేసిన వ్యక్తి(సీసీ ఫుటేజీ)

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: చిన్నపాటి నిర్లక్ష్యం.. కారు చోరీకి గురయ్యేలా చేసింది. విశ్రాంత ఐఏఎస్‌ కుమారుడు రోడ్డుపై కారు నిలిపి తాళం చెవులను అందులోనే మరవడంతో గమనించిన ఆగంతుకుడు ఆ కారుతో జారుకున్నాడు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్‌ నంబరు 10 పంచవటి కాలనీ ఐఏఎస్‌ సొసైటీలో విశ్రాంత ఐఏఎస్‌ వెంకటశివయ్య కుమారుడు కనమలూరు శ్రీహర్ష(52) నివసిస్తారు. ఆయన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో సమీపంలోని రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి సామగ్రి కొని కారులో పెట్టారు. తాళం చెవి కారులోనే పెట్టి పక్కనే ఉన్న మెడ్‌ప్లస్‌లో మందుల కొనుగోలుకు వెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించాడు. కారుతో పరారయ్యాడు. మందులు తీసుకొని బయటకు వచ్చిన శ్రీహర్షకు వాహనం కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెదికారు. సమీప సీసీ కెమెరాలను పరిశీలించగా విషయం వెలుగుచూసింది. రూ.25 లక్షల విలువైన కారు చోరీకి గురైందని పేర్కొంటూ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని