అనుమానాస్పద స్థితిలో ఫార్మా ఉద్యోగిని మృతి
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుమానాస్పద స్థితిలో ఫార్మా ఉద్యోగిని మృతి


మృతి చెందిన పొన్నపల్లి హేమవర్ష

పొన్నూరు, న్యూస్‌టుడే: ఓ ఫార్మా ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఉదంతం ఆదివారం హైదరాబాద్‌ మాదాపూర్‌లో చోటుచేసుకుంది. ఆమె స్నేహితుడు అంబులెన్స్‌లో మృతదేహాన్ని పొన్నూరు తీసుకురాగా, పరిశీలనగా చూసిన కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో పొన్నూరు అర్బన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ బత్తుల ప్రసాద్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పొన్నూరు పట్టణం 16వ వార్డు నేతాజీనగర్‌కు చెందిన పొన్నపల్లి హేమవర్ష (24) చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. ఆమె మేనమామ పోలూరి శ్రీనివాసరావు మేనకోడలి ఆలనా పాలనా చూస్తూ చదివించారు. ఆమె బీఫార్మసీ విద్యనభ్యసించారు. చదువు పూర్తికావడంతో కొద్ది కాలం క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగినిగా చేరారు. అదే కంపెనీలో పొన్నూరుకు చెందిన శేఖర్‌ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం హేమవర్ష అనారోగ్యానికి గురయ్యారు. శేఖర్‌ ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకొచ్చి అమెకు చికిత్స చేయించినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఆదివారం ఉదయం ఆమె ఉంటున్న గదికి శేఖర్‌ వెళ్లగా, ఆమె ముందుకు పడిపోయిన స్థితిలో కన్పించారు. వెంటనే ఆయన మళ్లీ సదరు ఆర్‌ఎంపీ వైద్యుడ్ని అక్కడికి తీసుకెళ్లాడు. ఆమె నాడి చూసి అప్పటికే ఆమె మృతిచెందినట్టు ఆయన చెప్పారు. దీంతో శేఖర్‌ మృతురాలి మేనమామ అయిన పోలూరి శ్రీనివాసరావుకు చరవాణి ద్వారా సమాచారమందించి, హేమవర్ష మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి అంబులెన్స్‌లో పొన్నూరు తీసుకువచ్చాడు. ఆమె భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు శేఖర్‌ను విచారిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని