Lockdown: రిటైల్‌ వ్యాపారుల లూటీ
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: రిటైల్‌ వ్యాపారుల లూటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎప్పుడు అవకాశం లభిస్తుందా అని ఎదురు చూసే రిటైల్‌ వ్యాపారులు.. లాక్‌డౌన్‌ పేరిట లూటీ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన రోజే ధరలు పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించారు. బుధవారం రైతుబజార్‌తో పోల్చితే అన్ని కూరగాయలు రెట్టింపు ధరలకు అమ్మకాలు జరిగాయి.

కరోనా వేళ భారీగా..

కొబ్బరి బొండాం నిన్న మొన్నటి వరకూ రూ.40 ఉండగా నేడది రూ. 50 అయింది. అరటి పళ్లు డజను రూ.50 నుంచి 60కి అమ్ముతున్నారు. ఇక ఎండు పళ్ళ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా వేళ ఖనిజాలు, లవణాలు అందించే వీటిని కొనాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు. కిలో బాదం ధర రూ.1000. వాల్‌ నట్స్‌ రూ.1600కు తగ్గడం లేదు. కేజీ ఎండు ద్రాక్ష రూ.500. కరోనాకు ముందు ఉండే ధరలు కంటే రెండింతలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎండు ద్రాక్ష ఎక్కువగా మహారాష్ట్ర నుంచి, జమ్ము కాశ్మీర్‌ నుంచి బాదం నగరానికి వస్తాయి.పోషకాల అంజీర్‌ కిలో రూ. 1600 పలుకుతోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని