రూ.29 లక్షలు ఊడ్చేసిన సైబర్‌ దొంగలు
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 08:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.29 లక్షలు ఊడ్చేసిన సైబర్‌ దొంగలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: మెయిల్స్‌లో వచ్చిన లేఖలు, వాటిపైసంతకాల ఆధారంగా ఏకంగా రూ.29 లక్షల వరకు ఆన్‌లైన్‌ బదిలీ చేశారు బ్యాంకు అధికారులు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. హైటెక్‌ సిటీలోని మైహోమ్‌ గుజర్‌లో నివాసముండే వీరేంద్ర భండారి క్యూబెక్స్‌ ట్యూబింగ్‌ లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌. ఈ కంపెనీకి బేగంపేట్‌లోని యాక్సిక్‌ బ్యాంక్‌లో ఖాతా ఉంది. మంగళవారం వీరేంద్ర బండారి తన ఖాతాలో బ్యాలెన్స్‌ చూస్తుండగా రూ.23.69 లక్షలు తేడా వచ్చింది. వెంటనే బ్యాంక్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌కు తన ఖాతాను బ్లాక్‌ చేయాలని మెయిల్‌ పంపించారు. మరుసటి రోజు బ్యాంక్‌కు వెళ్లి విచారించగా.. ‘తనకు మెడికల్‌ ఎమర్జెన్సీ అని, మా కుటుంబంలో అంతా కొవిడ్‌తో బాధపడుతున్నామని, అత్యవసరంగా డబ్బులు కావాలని ఓ ఫోన్‌ వచ్చిందని బ్యాంక్‌ మేనేజర్‌ చెప్పారు. కొద్దిసేపట్లోనే క్యూబెక్‌ సంస్థ మెయిల్‌తో వీరేంద్ర భండారి సంతకంతో మెయిల్‌ వచ్చింది. దానిలోని సంతకాన్ని పోల్చగా.. సరిపోవడంతో పాటు తనకొచ్చిన ఫోన్‌ నంబరును ట్రూకాలర్‌లో చూస్తే వీరేంద్ర భండారి అని ఉంది. వెంటనే పై మొత్తాన్ని ఆ లేఖలో పేర్కొన్న ఖాతాలకు బదిలీ చేసేశారు.

మరో ఘటనలో రూ.5 లక్షలు.. మోదీ ఇండియా కార్స్‌ యజమాని పేరు చెప్పి రూ.5 లక్షలు ఊడ్చేశారు సైబర్‌ దొంగలు. ప్రతాప్‌రాజ్‌ మోదీ సికింద్రాబాద్‌లోని ఎస్‌డీ రోడ్డులో మోదీ ఇండియా కార్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీకి సికింద్రాబాద్‌ కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌లో ఖాతా ఉంది. బుధవారం కంపెనీ ఖాతాలోంచి రూ.5 లక్షలు డెబిట్‌ అయినట్లుగా సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. బ్యాంక్‌ మేనేజర్‌కు ఫోన్‌ చేసి ఆరాదీయగా పై విధంగానే మోసపోయినట్లు తెలిసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని