
తాజా వార్తలు
బ్యాడ్మింటన్‌లో అదరగొట్టేశారు
కర్నూలు: ఈనాడు, స్ప్రైట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019లో భాగంగా నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో సోమవారం జూనియర్ కళాశాలల బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లో వందలాది మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలు చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ పోటీల్లో క్రీడాకారులు తమదైన ఆట తీరుతో ఉత్కంఠను రేపారు. సింగిల్స్ తుది పోరులో సాధిక్ (శ్రీనంది జూనియర్ కళాశాల, నందికొట్కూరు), శ్రీనివాసరెడ్డి (రావూస్ జూనియర్ కళాశాల, నంద్యాల)పై 21-19 తేడాతో గెలుపొంది టైటిల్ సాధించారు. శ్రీనివాసరెడ్డి రన్నర్స్‌గా నిలిచారు.
డబుల్స్ తుది పోరులోనూ సాధిక్, ఫారుఖ్ జోడి (శ్రీనంది జూనియర్ కళాశాల, నందికొట్కూరు), సురేంద్ర, శ్రీధర్ (గోస్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల) జోడీపై 21-9 స్కోరుతో గెలుపొంది టైటిల్ సొంతం చేసుకున్నారు.