పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరం
close

తాజా వార్తలు

Published : 19/01/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరం

55 వేలల్లో 380 మందికే ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల విధుల్లోని 55 వేల మంది ఉద్యోగుల్లో కేవలం 380 మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో సిబ్బందికి ఆసక్తి తక్కువగా ఉందని అభిప్రాయపడింది. విధుల్లోని ఉద్యోగులంతా పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని, ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌, ఆన్‌లైన్లో అవకాశం కల్పించామని పేర్కొంది.

సెలవు ప్రకటించే అధికారం కలెక్టర్లకే
పుర ఎన్నికల సందర్భంగా స్థానికంగా సెలవు ప్రకటించే అధికారాన్ని కమిషన్‌ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో సెలవు ప్రకటనపై కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని