మీటర్‌ రీడింగ్‌ మీరే తీసుకోవచ్చు
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 07:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీటర్‌ రీడింగ్‌ మీరే తీసుకోవచ్చు

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఐటీ యాప్‌లో అందుబాటులోకి
 రీడింగ్‌ స్కాన్‌ చేయగానే బిల్లు సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి నెలా మీ ఇంటి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి బిల్‌ ఇచ్చేందుకు ఇకపై సిబ్బంది రావాల్సిన పనిలేదు. మీ సెల్‌ఫోన్‌తో మీరే మీటర్‌ రీడింగ్‌ని స్కాన్‌ చేసి.. బిల్లు తీసుకునే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) బుధవారం ఈ సేవలను ప్రారంభించింది. సంస్థ ఐటీ యాప్‌లో ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికాన్ని జోడించి గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది.
ఏం చేయాలి...
ప్లే స్టోర్‌ నుంచి TSSPDCL IT యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్‌ వినియోగిస్తున్నవారు సైతం అప్‌డేట్‌ చేసుకోవాలి. యాప్‌ తెరవగానే ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికం కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబరు, ఈమెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు నమోదు చేయాలి. మీరు ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీటర్‌లో ‘కేడబ్ల్యూ హెచ్‌’ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. దానిని నొక్కగానే ఆన్‌లైన్‌లో బిల్లు కనిపిస్తుంది. చెల్లింపు సదుపాయం సైతం అందులో ఉంది. వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను  తెలుగులో అందుబాటులో ఉంచారు. ఒకవేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే? ఆ విషయం యాప్‌లో కనబడుతుంది. మీరే ముందు రీడింగ్‌ స్కాన్‌ చేసి బిల్లు తీసుకుంటే.. రీడింగ్‌ సిబ్బందికి ‘బిల్‌ జనరేటెడ్‌’ అని సమాచారం వెళుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని