ఆ నలుగురు లేకున్నా...
close

తాజా వార్తలు

Updated : 14/03/2021 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ నలుగురు లేకున్నా...

కడసారిచూపు చూడ్డానికి అయినవాళ్లే వెనుకాడుతున్న రోజులివి..మరి ఎవరో తెలియని అనాథమృతదేహాన్ని చూస్తే? వీలైనంత పక్కకు జరుగుతాం! కానీ ఎస్సై శిరీష మాత్రం రెండు కిలోమీటర్ల మేర ఓ అనాథ శవాన్ని మోసి మానవత్వాన్ని చాటుకున్నారు...
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ సమీపంలో ఉన్న అడవికొత్తూరు గ్రామ పంట పొలాలవి. గుర్తు తెలియని ఓ పెద్దాయన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఎస్సై కె.శిరీష అక్కడకు వెళ్లారు. ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న ఆ మృతదేహాన్ని చూసి అక్కడ నుంచి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో లలితా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకుల సాయంతో ఆ మృతదేహాన్ని మోయడానికి ఎస్సై శిరీష ముందుకొచ్చారు. నడవడానికి వీలుకాని ఆ పొలం గట్లపై రెండు కిలోమీటర్ల దూరం భుజంపై మోసుకుంటూ రహదారిపైకి చేర్చారామె. అక్కడ నుంచి కౌవల్య రథÅ]ంపై ట్రస్ట్‌ నిర్వాహకులు వృద్దుని మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. ‘ఎవరో వస్తారని ఎదురుచూడకుండా చొరవచూపించి.. ఖాకీ దుస్తుల వెనుక దాగిన మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది శిరీష’ అంటూ డీజీపీ ప్రశంసించారు.

 

-న్యూస్‌టుడే, కాశీబుగ్గ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని