close

తాజా వార్తలు

Published : 05/04/2021 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొట్ట తగ్గాలా...

పొట్ట తగ్గి చక్కటి శరీరాకృతిలో కనిపించాలని అంతా అనుకుంటాం. కానీ ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతుంటాం. ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి.
పైలెట్స్‌... పొట్ట తగ్గడానికి చేసే వ్యాయామాల్లో పైలెట్స్‌ను ప్రధానంగా చెప్పొచ్చు. ఈ వర్కవుట్‌ చేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు సులువుగా కరుగుతుంది. అంతేకాదు పొట్ట, వెన్నుకు రక్షణ కల్పించే కండరాలు ఎలాస్టిసిటీని పొందుతాయి. దాంతో పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులువుగా తగ్గుతుంది. శరీరమంతా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఫలితంగా కాలి వాపులు తగ్గుతాయి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల చక్కటి శరీరాకృతి మీ సొంతమవుతుంది.
ప్లాంక్‌.. ఇది కండరాలను బలోపేతం చేయడంతోపాటూ పొట్టనూ తగ్గిస్తుంది. రోజులో ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా చేసే వర్కవుట్‌ ఇది. అయితే ప్రారంభంలో తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.
తగినన్ని నీళ్లు... రోజూ కనీసం మూడు నాలుగు లీటర్ల నీటిని తాగితే... శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు సమృద్ధిగా తాగడం వల్ల పొట్ట తగ్గడమే కాదు. కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. నీటితోపాటు యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే గ్రీన్‌ టీ, పండ్ల రసాలనూ తీసుకుంటూ ఉండాలి.
ఊహలు... మీకు నచ్చిన దుస్తులు వేసుకున్నట్లు ఊహించుకోండి. ఆ ఊహను వాస్తవంగా మార్చడానికి ప్రయత్నించండి. సమతులాహారం, క్రమంతప్పని వ్యాయామం, కంటి నిండా నిద్ర వల్ల అధిక బరువు, అదనపు కొవ్వు.. లాంటి సమస్యలు దరి చేరవు.
ఒత్తిడిని తగ్గించుకోండి... ఈరోజుల్లో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. అయితే కొందరు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆహారాన్ని తినేస్తారు. ఇదిలా కొనసాగితే అధిక బరువు, పొట్టకు దారితీస్తుంది. ఒత్తిడి వల్ల హార్మోన్లలో కలిగే హెచ్చుతగ్గులే ఇందుకు కారణం. కాబట్టి స్ట్రెస్‌ను నియంత్రించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం లాంటివి రోజూ చేయడాన్ని అలవాటుగా మార్చుకోండి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్