close

తాజా వార్తలు

Published : 15/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వంటింటి చిట్కాలు...

భర్త, పిల్లల అవసరాలు తీర్చి...కాస్త భోజనం బాక్సులో సర్దుకుని హడావిడిగా ఆఫీసుకి పరిగెత్తే మహిళలు చాలామందే. ఈ పరిస్థితుల్లో సమయానికి దొరకని వస్తువులు, జిడ్డుగా మారిన వంటగదితో బోలెడు ఇక్కట్లు. అలాంటివారి కోసమే ఈ చిట్కాలు.

ర్నాడు చేయబోయే వంట ఏంటో ముందే నిర్ణయించుకుంటే... బోలెడు సమయం మిగిలినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే రేపేం వండాలి అనే సందిగ్ధతలో పడి...మిగిలిన పనులు ఆలస్యమవుతుంటాయి. వీలైతే వార ప్రణాళిక వేసుకుంటే మరీ మంచిది. అలానే వంటింట్లో వాడే పదార్థాలను టిఫిన్‌, భోజనం, స్నాక్స్‌...ఇలా వర్గీకరించుకోండి. వీటికి సంబంధించిన సీసాలన్నింటినీ ఒక్కో ట్రేలో పెట్టుకోండి. వంట చేసేప్పుడు అదొక్కటే దగ్గర పెట్టుకుంటే వెతుక్కునే అసవరం ఉండదు.

* వంటింట్లో పొయ్యి వెనుక గోడ జిడ్డు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని స్టీలు పీచుతో అదేపనిగా తోమితే కానీ శుభ్రం కాదు. కానీ అది మాటల్లో చెప్పినంత తేలిక కాదు. రెండు రోజులకోసారైనా గోడపై కాస్త వంటసోడా చల్లి రుద్దండి. జిడ్డు వదిలిపోతుంది. అంతేకాదు వంట గట్టుని తుడిచేందుకు లింట్‌ఫ్రీ వస్త్రాల్ని వాడండి. ఇవి మీ పనిని సులువు చేస్తాయి. వంటగదిని శుభ్రంగానూ ఉంచుతాయి.

* కొన్ని కూరగాయలు, ఇతర పదార్థాలను నేరుగా వినియోగించేలా సిద్ధం చేసుకుంటే...వంట సమయం ఆదా అవుతుంది. ఉదాహరణకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి తొడిమలు తీసి పెట్టుకోవడం, చింతపండు గుజ్జుగా చేసి ఉంచుకోవడం, చట్నీల్లోకి వినియోగించే పల్లీలను వేయించి పొడి చేసుకోవడం  వంటివి. ఇవి మీపై రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తాయి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని