
తాజా వార్తలు
గ్రేటర్లో..పలుచోట్ల ఉద్రిక్తత
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ పలు చోట్ల ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద, బంజారాహిల్స్ ఎన్జీనగర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.
భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్: బంజారాహిల్స్ ఎన్జీటీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని తెరాస శ్రేణులు ఆందోళనకు దిగారు. తెరాస కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారని భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల వారినీ చెదరగొట్టారు. దీంతో ఎన్జీటీ నగర్లో ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి పువ్వాడ అజయ్ వాహనంపై దాడి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ తెరాస కార్తపై భాజపా కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భాజపా కార్యకర్తలను చెదరగొట్టారు.
గులాబీ మాస్కులపై కాంగ్రెస్ అభ్యంతరం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో తెరాస ఏజెంట్లు గులాబీ రంగు మాస్కులు ధరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి పీసీసీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
కేపీహెచ్బీలో ఘర్షణ
కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్ కేంద్రం 58 వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెరాస నాయకులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. బోరబండ, తార్నాకలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
ఎస్ఈసీ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదుల వెల్లువ..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల్లోని పారిశ్రామకవాడల్లో పనిచేస్తు్న్న పలువురు కార్మికులు ఎస్ఈసీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తాము ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతించడం లేదని ఫిర్యదు చేశారు. సంబంధిత కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.
ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌కు ఆదేశం
ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేటలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఎల్లుండి రీ పోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్‌ను ఎస్ఈసీ నిషేధించింది.
జియాగూడలో ఓటర్ల ఆందోళన
జియాగూడలోని బూత్ నెంబర్ 36, 37, 38లో అధిక సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 3వేల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. అధికారులు తెరాస, ఎంఐఎంతో కుమ్మక్కై ఓట్లను తొలగించారని స్థానికులు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న జోనల్ కమిషనర్ ప్రావీణ్యం ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు ఓట్ల గురించి ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. జియాగూడా వార్డులో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయినట్ట వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం తెలిపింది. జియాగూడలోని పోలింగ్ కేంద్రం 38 లో మొత్తం 914 ఓట్లు ఉండగా వీటిలో 268 మినహాయించి మిగిలిన ఓట్లను పోలింగ్ కేంద్రం 29, 30, 31లకు బదిలీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. స్థానిక విద్యాశ్రీ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈ ఓట్లు ఉన్నాయని తెలిపారు.
చాంద్రాయణగుట్టలో...
ఓట్లు గల్లంతయ్యాయంటూ చంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు. మరి కొందరు ఓట్లు వేరే డివిజన్‌కు మార్చారని ఆరోపించారు. గత 30 ఏళ్ల నుంచి ఇదే డివిజన్లో ఓటు వేస్తున్నా.. ఇప్పుడు ఓటరు జాబితాలో పేరు లేదని పలువురు వాపోయారు.అమీర్‌పేట డివిజన్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. బల్కంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇవీ చదవండి...
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
ఓటర్ స్లిప్ రాలేదా.. ఇలా చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
