close

తాజా వార్తలు

Updated : 01/12/2020 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్‌


హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.  కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

 ఓట్లు గల్లంతయ్యాయంటూ చంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌లో పలువురు ఆందోళనకు దిగారు. మరి కొందరు ఓట్లు వేరే డివిజన్‌కు మార్చారని ఆరోపించారు. గత 30 ఏళ్ల నుంచి ఇదే డివిజన్‌లో ఓటు వేస్తున్నా.. ఇప్పుడు ఓటరు జాబితాలో పేరు లేదని పలువురు వాపోయారు.అమీర్‌పేట డివిజన్‌లో ఉదయం నుంచే ఓటర్లు  ఓటు వేసేందుకు ఆసక్తి కనబర్చారు. బల్కంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం, జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
 

ఇవీ చదవండి...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

ఓటర్ స్లిప్‌ రాలేదా.. ఇలా చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన