
తాజా వార్తలు
ఓల్డ్ మలక్‌పేటలో తారుమారైన గుర్తులు
హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట డివిజన్లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల గుర్తులు మారడంతో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాలెట్ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు.
Tags :