close

తాజా వార్తలు

Updated : 06/03/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ తగ్గించారు: మేయర్‌

హైదరాబాద్‌: నగర ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్‌ ఇచ్చిందని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే సులభతర జీవనంలో హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ను తగ్గించారని ఆమె ఆక్షేపించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి 24వ స్థానం ప్రకటించడం సరికాదన్నారు. ఈ మేరకు మేయర్‌ ఓ ప్రకటన విడుదల చేశౄరు. 

ముత్యాల నగరంగా పేరుపొందిన హైదరాబాద్‌.. అభివృద్ధిలో దేశంలోని అన్ని నగరాల కంటే ముందు దూసుకెళ్తోందని చెప్పారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రామాణికాలూ హైదరాబాద్‌కు ఉన్నాయన్నారు. 24వ ర్యాంకు ప్రకటించడాన్ని హైదరాబాదీయులు అంగీకరించరని మేయర్‌ చెప్పారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని