AP News: ప్రకాశంలో జంబలకిడిపంబ!

తాజా వార్తలు

Published : 23/06/2021 01:20 IST

AP News: ప్రకాశంలో జంబలకిడిపంబ!

పెద్దారవీడు: అబ్బాయి అమ్మాయిగా, అమ్మాయి అబ్బాయిగా మారడం వినగానే టక్కున గుర్తొచ్చేది ‘జంబలకడి పంబ’ సినిమానే. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ వివాహంలో సరిగ్గా ఇదే జరిగింది. పెద్దారవీడు మండలం బి.చెర్లోపల్లి గ్రామంలో గుమ్మా ఆవులయ్య కుమారుడు అంకయ్య వివాహం అరుణ అనే యువతితో జరిగింది.   పెళ్లి తరువాత పోలేరమ్మ, అంకాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వరుడు వధువులా.. వధువు వరుడి వేషధారణతో తప్పెట్లు, తాళాలతో గ్రామ శివారులో ఉన్న జమ్మి చెట్టు, నాగులపుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ వంశంలో పూర్వకాలం నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అంకయ్య కుటుంబసభ్యులు తెలిపారు. గుమ్మా ఇంటి పేరున్న వారు తమ ఇళ్లల్లో వివాహం జరిగితే ఈ ఆచారాన్ని పాటిస్తారని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని