అన్నాడీఎంకే ఆఫర్‌పై జీకే వాసన్‌ అసంతృప్తి 
close

తాజా వార్తలు

Published : 12/03/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నాడీఎంకే ఆఫర్‌పై జీకే వాసన్‌ అసంతృప్తి 

12 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌

చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకే కూటమి పార్టీల్లో సీట్ల కేటాయింపు వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆఫర్‌పై తమిళ్‌ మానిళ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధ్యక్షుడు జీకే వాసన్‌  అసంతృప్తి వ్యక్తంచేశారు. తాము 12 స్థానాలు అడిగితే సాధ్యం కాదంటున్నారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు కేవలం ఆరు సీట్లు ఇస్తామంటున్నారన్నారు. తమ పార్టీ పరిస్థితిని చెప్పామని, వారి నుంచి పిలుపు కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. తమకు ఉన్న విజయావకాశాల ఆధారంగానే సీట్లు కోరాం తప్ప ఇతర లెక్కలేమీ తమకు లేవన్నారు. తాము కోరిన సీట్లు ఇస్తారని వాసన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. తమ పార్టీకి సైకిల్‌ గుర్తు కేటాయించే అంశంపై ఆఖరి నిమిషం వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

కోవిల్‌పట్టి నుంచి బరిలో దినకరన్‌
ఏఎంఎంకే పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్‌ కోవిల్‌పట్టు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన 49మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశారు. ఎంఐఎం, ఎస్‌ఐడీపీలతో కలిసి కూటమిగా ఏఎంఎంకే బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని