పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేత
close

తాజా వార్తలు

Published : 25/03/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంతంగి టోల్‌ వద్ద భారీగా బంగారం పట్టివేత

పంతంగి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల విలువ దాదాపు రూ. 11.63 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అస్సాంలోని గువహటి నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. విదేశాల నుంచి తెప్పించిన బంగారాన్ని హైదరాబాద్‌లోని వివిధ దుకాణాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్‌ చేసి.. బంగారం తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది.. హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని