close

తాజా వార్తలు

Updated : 04/03/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 1 PM

1. బ్రహ్మీ మీమ్స్‌తో నగర పోలీస్‌ స్పెషల్‌ వీడియో

సమాజంలో జరుగుతోన్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీస్‌ శాఖ పలు ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. ఫొటోలు, వీడియోలతో తరచూ ప్రజల్ని అప్రమత్తం చేసిన హైదరాబాద్‌ నగర పోలీస్‌ శాఖ తాజాగా ఓ స్పెషల్‌ వీడియోతో అందర్నీ ఆకర్షిస్తోంది. ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల వలలో చిక్కుకుని, చివరికి ఆ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. అలాంటి మోసాల పట్ల ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తూ.. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన పలు చిత్రాల్లోని కామెడీ సీన్స్‌తో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం ఓ ప్రత్యేక వీడియోని రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కోర్టుల తీర్పులు అనువాదం కావాలి:ఉపరాష్ట్రపతి

ప్రతి ఒక్కరూ వీలైనన్ని భాషలు నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం ‘ఐఐటీ తిరుపతి 6వ ఇన్‌స్టిట్యూట్‌ డే’ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్త ఆవిష్కరణలపై యువత దృష్టి సారించాలి. అన్ని పుస్తకాలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. శాస్త్ర సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్రాల బోధన ప్రాంతీయ భాషల్లోనే జరగాలి. ప్రాథమిక స్థాయి నుంచి బోధన మాతృభాషలోనే జరగాలి. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలో ఉండాలి. కోర్టుల్లో జరిగే వాదప్రతివాదనలు మాతృభాషలోనే జరగాలి. కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావాలి. ఆంగ్ల భాషకు నేను వ్యతిరేకం కాదు’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా’

వైకాపా ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గురువారం ఉదయం బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా నడుపుతున్నారని ఆరోపించారు. తనను విమర్శించే వైకాపా నాయకులు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మేనిఫెస్టో చూసి ఓటేయండి: లోకేశ్‌

* ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి టికెట్లు

4. ఉద్యోగం రాలేదు.. తాజ్‌మహల్‌లో బాంబు పెట్టా

ఆగ్రాలోని ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. తాజ్‌మహల్‌లో బాంబ్‌ ఉందంటూ ఈ ఉదయం పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. అయితే అది నకిలీ కాల్‌ అని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తాజ్‌ మహల్‌ వద్ద బాంబు పెట్టినట్టు గురువారం ఉదయం పోలీసులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘సైనిక నియామకాల్లో అవతకవలు జరుగుతున్నాయి. నన్ను రిక్రూట్‌ చేసుకోలేదు. అందుకే తాజ్‌మహల్‌లో బాంబ్‌ పెట్టా. త్వరలోనే అది పేలుతుంది’’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు ఆగ్రా ఎస్పీ శివరామ్‌ యాదవ్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అలా చేస్తే రూ. 75కే లీటర్‌ పెట్రోల్‌

చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొస్తే దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75కు దిగొస్తుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. కానీ ఇందుకు రాజకీయ నాయకులు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, దేశ జీడీపీలో ఇది కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌కు ఇలా కొనసాగడం నమ్మశక్యంగా లేదు  

అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ (60 మ్యాచ్‌లు) రికార్డును కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సమం చేశాడు. మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు.. కోహ్లీ కెరీర్‌లో కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌గా నిలిచింది. దీంతో విరాట్‌ కోహ్లీ మాజీ సారథితో సమానంగా నిలిచాడు. అలాగే గతవారం పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు(22) సాధించిన సారథిగానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఇది ధోనీ(21)పేరిట ఉండేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* భారత్‌Xఇంగ్లాండ్‌ నాలుగో టెస్టు: లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్‌ చేయండి

7. ‘అక్కడి హింసపై ప్రపంచ దేశాలు గొంతెత్తాలి’

మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నిరసన చేస్తున్న వారిపై సైన్యం కాల్పులు జరపడాన్ని అగ్రరాజ్యం తప్పుబట్టింది. ఆ దేశంలో బుధవారం చోటుచేసుకున్న హింసాత్మక సన్నివేశాలు తమను ఆందోళనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. రహదారులపైకి వచ్చి నిరసనలు చేపట్టిన ప్రజలపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో 38 మంది మరణించినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తారక్‌ గ్యారేజ్‌లో లంబోర్గినీ..!

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కార్ల కలెక్షన్‌లోకి మరో హైఎండ్‌ మోడల్‌ వాహనం వస్తోంది. అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ లంబోర్గినికి చెందిన ఉరాస్‌ త్వరలో ఎన్టీఆర్‌ గ్యారేజీకి చేరనుంది. గతంలో ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు ఈ మోడల్‌ కారులోనే చక్కర్లు కొట్టారు. ఆ రైడ్‌ని బాగా ఎంజాయ్‌ చేసిన తారక్‌ ఉరాస్‌ను తన కలెక్షన్లలో ఉంచాలనుకున్నారు కాబోలు. వచ్చే నెలలో ఈ వాహనం తారక్‌ గ్యారేజ్‌కి చేరుకోనుంది. టాలీవుడ్‌లో ఆల్‌రౌండ్‌ కథానాయకుడిగా పేరున్న తారక్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లేకున్నా.. ఉన్నట్లు చూపించే ‘మెష్’

త్రీడీ సినిమాలు చూసేందుకు ఆసక్తిగా ఉంటాయి. ఎందుకో తెలుసా..? సినిమాలోని క్యారెక్టర్లు మన పక్కనో, మీదకొచ్చినట్లు ఉండటంతో ప్రేక్షకుడు బాగా కనెక్ట్‌ అయిపోతాడు. ఎన్నో అద్భుతమైన నూతన ఆవిష్కరణలు చేస్తున్న మైక్రోసాఫ్ట్‌ వర్చువల్‌ రియాల్టీ టెక్నాలజీలో మరొక ముందడుగు వేసింది. మైక్రోసాఫ్ట్‌ ‘మెష్‌’ పేరుతో యూజర్లకు మిక్స్‌డ్‌ రియాల్టీ అనుభూతిని కల్పించనుంది. ఉత్పత్తికి సంబంధించిన వివరాలను మైక్రోసాఫ్ట్‌ తాజాగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మేం నాస్తికులం కాదు: సీపీఐ నారాయణ

గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా తెదేపా నేత నసీర్‌ అహ్మద్‌, మేయర్‌ అభ్యర్థి నానితో కలిసి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ‘‘ఎన్నికల్లో వైకాపా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నిర్బంధ ఏకగ్రీవాలు ఇప్పుడే చూస్తున్నా. ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ చూడలేదు. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలకు ఓట్లు రావని భయమా? స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగా కలిశా. ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నాం. మేం నాస్తికులం కాదు.. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదు’’ అని నారాయణ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని