Top TenNews @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 25/07/2021 12:55 IST

Top TenNews @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ఇవాళ పాదయాత్ర చేపట్టారు. కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి దువ్వాడ వరకు సాగిన యాత్రలో పెద్దసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల కాలనీల్లో పర్యటించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని కార్మికులు హెచ్చరించారు. పరిశ్రమ పరిరక్షణే లక్ష్యంగా ఆగస్టు 1, 2 తేదీల్లో ‘చలో పార్లమెంట్‌’ చేపడుతున్నట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. 

2.  గోదావరికి పోటెత్తిన వరద.. విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం

గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయానికి రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరులో రెండు బృందాలు, వీఆర్‌ పురానికి ఒక సహాయబృందాన్ని పంపారు. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచించారు. పోలవరం వద్ద కూడా గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. స్పిల్‌వే వద్ద 32.8 మీటర్లకు వరద చేరింది.

Eluru Elections: 7 చోట్ల వైకాపా.. ఒక చోట తెదేపా విజయం

3. మీరాబాయి చాను..  పతకాల డెడ్లీ కాంబినేషన్‌ ఇలా..!

మన హైదరాబాద్‌లో పావు వంతు జనాభా.. పర్వతాలు.. గుట్టలతో దుర్భేద్యమైన భూభాగం.. అత్యాధునిక సదుపాయాలు కనిపించవు.. కానీ, రెండు ఒలింపిక్‌ పతకాలు..! ఇదేలా సాధ్యమైందంటే.. ఒక్కటే సమాధానం..! క్రీడలు అనేవి మణిపూర్‌ వాసుల డీఎన్‌ఏలోనే ఉన్నాయి..! అక్కడి పర్వత ప్రాంతాలు.. వారి సంస్కృతి.. పుట్టుకతో వచ్చే జన్యువులు.. ఆహారపు అలవాట్ల నుంచి లభించే అడ్వాంటేజ్‌.. కఠిన పరిశ్రమ.. ఈ డెడ్లీ కాంబినేషన్‌ వారిని ఛాంపియన్లుగా మలుస్తోంది. ఒలింపిక్స్‌ జరుగుతున్న ప్రతిసారి పతకాల పట్టికలో భారత్‌ స్థానం సాధించే వరకూ టెన్షనే.

4. ముక్కుకు తెలుసు.. కొవిడ్‌ ఎవరిలో తీవ్రమవుతుందో!

కొవిడ్‌ బాధితుల్లో కొంతమందే తీవ్రస్థాయి అనారోగ్యం బారిన పడుతున్నారెందుకు? ఎలాంటి వారిలో ఈ పరిస్థితి తలెత్తుతోంది? అన్న చిక్కుముడిని విప్పేందుకు అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. అనారోగ్య తీవ్రతను అంచనా కట్టడానికి వైద్య నిపుణులు సాధారణంగా రక్త పరీక్షలు చేస్తుంటారు. అయితే, ముప్పును అంచనా వేయడానికి అదేమీ అంత సరైన పరీక్ష కాదంటున్నారు... మసాచుసెట్స్, మిసిసిపీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు! ముక్కు, నోటి కుహరంలోని కణాలను పరీక్షించడం ద్వారా కొవిడ్‌ బాధితుల్లో ఎవరెవరు తీవ్ర అనారోగ్యం బారినపడే ప్రమాదముందన్నది తెలుసుకోవచ్చని ప్రతిపాదించారు.

5. పంజాబ్‌కు పరిష్కారం లభించింది.. ఇప్పుడిక రాజస్థాన్‌ వంతు!

వివిధ రాష్ట్రాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇటీవలే పంజాబ్‌ సమస్యకు స్వస్తి పలికిన అధిష్ఠానం ఇప్పుడు రాజస్థాన్‌లోనూ రాజీకి యత్నిస్తోంది. ఈ మేరకు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనుంది. గతంలో తిరుగుబాటు చేసి చల్లబడిన సచిన్‌ పైలట్‌ వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ మేరకు క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి.

6. 39,742 కేసులు.. 39,972 రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్తకేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కొత్త కేసులు నమోదు కాగా.. 535 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,18,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,20,551కి చేరింది. 

7. Karnataka CM yediyurappa: అంతులేని ఆఖరి కథ

కన్నడనాట అర్ధ శతాబ్దానికి పైగా రాజకీయాలను శాసించిన బి.ఎస్‌.యడియూరప్ప జీవితంలో ఆదివారం అత్యంత కీలకంగా మారనుంది. తన రాజీనామాపై విస్తృత స్థాయిలో వ్యాపించిన వదంతుల నడుమ గురువారం ఆయన ఓ కీలక ప్రకటనే చేశారు. అధిష్ఠానం నుంచి ఆదివారం అందే సూచనపైనే నా భవిష్యత్తు ఆధారపడుతందని ఆయన వెల్లడించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఆయన అంచనా ప్రకారం పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రాజీనామాపై ఆదివారమే స్పష్టత ఇవ్వనున్నారు.

8. 22 కోట్ల జనాభా.. ఒలింపిక్స్‌లో 10 మంది.. సిగ్గుచేటు!

‘‘22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌కు కేవలం 10 మంది ఆటగాళ్లే. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటు’’ పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నాజిర్‌ అన్న మాటలివి. టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ నుంచి 10 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుండడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో అద్దం పట్టే ఓ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

9. భార్యలపై ఆర్జీవీ వెబ్‌సిరీస్‌... ప్రమోషనల్‌ వీడియో చూశారా

స్త్రీల అసలు స్వరూపం వాళ్లు భార్యలుగా మారినప్పుడే విశ్వరూపమై బయటకు వస్తుందని అంటున్నారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. విభిన్నమైన కాన్సెప్ట్‌లతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తెరకెక్కించి ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ఓ ఆకట్టుకునే అంశంపై వెబ్‌సిరీస్‌ చిత్రీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భార్యలు.. వాళ్లల్లో రకాలు అనే అంశాన్ని చూపిస్తూ ఈ సిరీస్‌ రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ ఓ ప్రమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు.

10. సీలింగ్‌కు కన్నాలేసి దుకాణాల్లో చోరీ

విజయవాడ బందర్‌రోడ్డులో ఉన్న పెనమలూరు కూడలి వద్ద దొంగలు హల్‌చల్‌ చేశారు. కూడలిలోని నాలుగు దుకాణాల సీలింగ్‌లకు రంధ్రాలు వేసి చోరీకి పాల్పడ్డారు. రహదారికి ఆనుకునే ఉన్న దుకాణాల్లో చోరీ జరగడం స్థానికంగా కలకలం రేపింది. మొబైల్‌, చెప్పులు, హార్డ్‌వేర్‌, కిరాణా దుకాణాల్లో దొంగతనం జరిగినట్లు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే క్లూస్‌ బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనం జరిగిన దుకాణాలను పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని