
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. దేశంలో కరోనా మరణాలు @138
భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం మరోసారి తారా స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో 138 మంది మహమ్మారి కారణంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కేసుల విషయానికొస్తే.. క్రితం రోజుతో పోలిస్తే భారీ పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 7.93లక్షల పరీక్షలు చేయగా.. 16,738 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చాక్లెట్స్‌తోనూ లాభాలున్నాయ్!
చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చాక్లెట్స్ తింటే దంతాలు పాడవుతాయి, చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియని భయం. కానీ, మితంగా తింటే చాక్లెట్స్‌తో మంచి లాభాలే ఉన్నాయి. అవేంటో చూద్దామా..! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. రైస్ మిల్లుకు రూ.80 కోట్ల విద్యుత్ బిల్లు!
మహారాష్ట్రలో ఓ రైస్ మిల్లు యజమాని విద్యుత్తు బిల్లు ఇచ్చిన షాక్‌కు నిర్ఘాంతపోయాడు. ఇంతకీ వచ్చిన బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా ఎనభై కోట్ల రూపాయలు!! పాల్ఘర్కు చెందిన 66 ఏళ్ల గణపత్ నాయక్‌కు ఓ రైస్ మిల్లు ఉంది. ప్రతినెలా దానికి రూ.50 వేలకు కాస్త అటూఇటూ బిల్లు వచ్చేది. గత సోమవారం మాత్రం ఏకంగా రూ.80,13,89,600 బిల్లు ఆయన చేతికొచ్చింది. దిగ్భ్రాంతి చెందిన ఆయన అధికారులను ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అంగారకుడిపైకి రహస్య సందేశం!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ప్రతిష్ఠాత్మక పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడంలో కీలక పాత్ర పోషించిన భారీ పారాచూట్ తనతోపాటు ఓ రహస్య సందేశాన్ని మోసుకెళ్లింది. ‘‘గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి’’ అని ఈ 70 అడుగుల పారాచూట్‌పై సిస్టమ్స్ ఇంజినీర్ ఇయాన్ క్లార్క్ బైనరీ కోడ్ల ద్వారా రాశారు. పజిల్‌లను బాగా ఇష్టపడే క్లార్క్‌కు ఇలాంటి సందేశాన్ని పంపించాలన్న ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చిందట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* అమెరికాలో వీసా బ్యాన్ ఉపసంహరణ..!
5. ఒకే రోజు రెండు పెద్ద సినిమాల విడుదల!
భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోనుందా..? అవుననే చెప్పాలి. ఎందుకంటే.. సాధారణంగా ఒకేరోజు ఒకటి అంతకంటే ఎక్కువ సినిమాలు విడుదల కావడం పెద్ద వింత కాదు. అయితే.. భారీ అంచనాలున్న సినిమాలు ఒకేరోజు విడుదలైతే మాత్రం విశేషమే. బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ సినిమాలు విడుదలయ్యే రోజు తమ సినిమా విడుదల చేయడానికి ఎవరూ సాహసం చేయరు. కానీ.. బాలీవుడ్ భామ ఆలియాభట్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. బడ్జెట్ ధరలో గేమింగ్ ఫోన్ కావాలా..
గతంలో వీడియో గేమ్ అంటే దాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవడమో లేదా గేమింగ్ సెంటర్లకి వెళ్లి కొంత నగదు చెల్లించి ఆడేవారు. తర్వాతి కాలంలో చేతిలో ఇమిడిపోయే సైజ్‌లో గేమింగ్ కన్సోల్స్ వచ్చాయి. ప్రస్తుతం డిజిటల్ సాంకేతిక విస్తరిచడంతో వీడియో గేమ్స్‌కి అనుకూలమైన ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇటీవల రియల్మీ విడుదల చేసిన బడ్జెట్ గేమింగ్ మోడల్స్ ఏంటి..వాటి ధరెంత..ఎలాంటి ఫీచర్లున్నాయో తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఇక మీడియాకు ఫేస్బుక్ డబ్బు చెల్లించాల్సిందే!
ఆస్ట్రేలియాలో నూతన మీడియా చట్టం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ప్రచురించే కంటెంట్‌కు సంబంధించి మీడియా సంస్థలకు రుసుము చెల్లించేలా తయారు చేసిన ‘న్యూస్మీడియా బార్గైనింగ్ కోడ్’ బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్స్ మంత్రి పాల్ ఫ్లెచర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ చట్టంతో ఇక నుంచి ఫేస్‌బుక్‌తో పాటు, గూగుల్ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలలో ప్రచురించే న్యూస్ కంటెంట్‌పై ఆ దేశ మీడియా సంస్థలకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఒకే హాస్టల్లో 190 మందికి కరోనా!
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసుల విజృంభణ కొనసాగుతోంది. వషిమ్ జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 190 మందికి వైరస్ సోకడం కలకలం సృష్టించింది. వైరస్ సోకిన వారిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం. దీంతో అధికారులు పాఠశాల పరిసరాల్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. కాగా, వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో.. ఇటీవల మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందిన అమరావతి, యావత్మల్ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. కీలక మైలురాయి దాటిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రికార్డు స్థాయికి చేరుకోవడంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9 లక్షల కోట్లకు చేరింది. మెరుగైన నికర వడ్డీ మార్జిన్లు, అధిక వడ్డీయేతర ఆదాయం మరియు స్థిరమైన ఆస్తి నాణ్యతతో డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు బ్యాంక్ ఊహించినదానికంటే మెరుగ్గా ఉండటంతో బ్యాంక్ షేర్లు మంచి పెరుగుదలను చూశాయి. బీఎస్ఇలో బ్యాంక్ షేర్లు రికార్డు స్థాయిలో రూ. 1,635ను తాకాయి. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ గురువారం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9 లక్షల కోట్లను దాటింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఇలాగైతే గిల్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఓపెనర్ శుభ్‌మన్‌గిల్(11) ఔటైన విధానం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టే కాకుండా ఆతిథ్య జట్టూ తడబడింది. ఈ క్రమంలోనే గిల్ తక్కువ స్కోరుకు వెనుదిరిగి నిరాశపర్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* సెక్యూరిటీ కళ్లు గప్పి.. కోహ్లీని కలిసేందుకు