close

తాజా వార్తలు

Published : 25/02/2021 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. రెండో దశ కరోనాతో జాగ్రత్త: హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీరం సర్వే చేయాలని హైకోర్టు గురువారం ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు చేసిన పరీక్షల వివరాలను నివేదికలో పొందుపరిచింది.  కరోనా నిర్ధరణ కోసం 1,03,737 ఆర్టీపీసీఆర్‌, 4,83,266 యాంటీజెన్‌ పరీక్షలు చేశామని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: చంద్రబాబు

తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పేదలకు అండగా ఉంటూ వాళ్ల తరఫున పోరాడతానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా, 25 ఏళ్లు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నానని.. నేనేదో భయపడతాననుకుంటే ఖబడ్దార్‌ అని పరోక్షంగా వైకాపా నేతలను హెచ్చరించారు. సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా

3. ఉత్తమ్‌ ముందే కాంగ్రెస్‌ నేతల ఘర్షణ

కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మహబూబాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే మహబూబాబాద్‌, డోర్నకల్‌కు చెందిన రెండు వర్గాలు గొడవకు దిగాయి. మహబూబాబాద్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వేదికపై ఒక వర్గం పేరు చెప్పి మరో వర్గం ప్రస్తావన లేదని శ్రేణులు గొడవకు దిగాయి. సుమారు 20 నిమిషాల పాటు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కాంగ్రెస్‌లో ఆ సంస్కృతి మంచిదికాదు: జానారెడ్డి

4. దాత అవయవం నుంచి కరోనా: మహిళ మృతి!

ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్‌ నోరు.. ముక్కు.. కళ్ల ద్వారా సోకుతుందని అందరికి తెలిసిందే. కాగా.. దాత అవయవం నుంచి ఓ మహిళకు కరోనా సోకిన అరుదైన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అవయవ మార్పిడి జరిగిన తర్వాత రెండు నెలల పాటు ఆమె కరోనాతో పోరాడి మృతి చెందడంతో అవయవాల మార్పిడిలో భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. మిషిగాన్‌కు చెందిన ఓ మహిళకు ఊపిరితిత్తుల్లో సమస్య ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ‘విభజించి.. పాలించడం’ కాంగ్రెస్‌ విధానం: మోదీ  

కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో మత్స్య రంగానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేయడం తనకు దిగ్బ్రాంతి కలిగించిందని మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పుదుచ్చేరి పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం లాస్పేట్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ నేత మత్స్య శాఖ ఏర్పాటు చేస్తానని చేసిన వ్యాఖ్యలతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. నిజమేంటంటే.. కేంద్రంలో ఆ శాఖ ఇప్పటికే ఉంది. ఎన్డీయే ప్రభుత్వం 2019లోనే ఫిషరీస్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది’ అని మోదీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సెన్సెక్స్‌ 51,000+..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలకు తోడు మెటల్‌, ఎనర్జీ షేర్ల అండతో సూచీలు లాభాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్‌ మరోసారి 51వేల మార్కును దాటగా.. నిఫ్టీ 15,100కు కొద్ది దూరంలో ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.42గా ఉంది. ఉదయం 51,211 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరికి 257.62 పాయింట్ల లాభంతో 51,039.31 వద్ద ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టూల్‌కిట్‌ కేసు: శంతనుకు అరెస్టు నుంచి రక్షణ

గ్రెటా థెన్‌బర్గ్‌ ‘టూల్‌కిట్‌’ కేసులో అనుమానితుడిగా ఉన్న శంతను ములుక్‌కు దిల్లీ కోర్టు మార్చి 9 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ మేరకు గురువారం అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ జరిగే వరకు శంతనుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఆయన తీర్పులో వెల్లడించారు. కాగా ఈ అంశంపై అదనపు వివరాలను సమర్పించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బెంగాల్‌కు పూర్వవైభవం తెస్తాం: నడ్డా

పశ్చిమబెంగాల్‌లో భాజపా అధికారంలోకి వస్తే రైతులకు పీఎం కిసాన్‌ యోజన పథకంతో లబ్ధి చేకూరుస్తామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హామీనిచ్చారు. బెంగాల్‌ పర్యటనకు విచ్చేసిన నడ్డా.. గురువారం ఉదయం కోల్‌కతాలో ‘సోనార్‌ బంగ్లా మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మేం అధికారంలోకి వస్తే బెంగాల్‌ సంస్కృతికి కొత్తదనాన్ని తీసుకువస్తాం. అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాం. రాష్ట్రంలో అక్రమంగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలకు ముగింపు పలుకుతాం. తిరిగి బెంగాల్‌కు మేం పూర్వ వైభవం తీసుకువస్తాం’ అని నడ్డా చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌కు నీరవ్‌ మోదీ అప్పగింత!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. భారత్‌కు అప్పగించినా నీరవ్‌కు అన్యాయం జరగదని పేర్కొంది. అలాగే నీరవ్‌ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టి పారేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మొతేరా టెస్టు: భారత్‌Xఇంగ్లాండ్‌

పింక్‌బాల్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకు ఆలౌటైంది. చివరి వికెట్‌గా బుమ్రా(1)ను ఎల్బీగా ఔట్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ 5/8 టెస్టుల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. దీంతో టీమ్‌ఇండియాకు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌లో రెండు వికెట్లను కోల్పోయింది. లైవ్‌ బ్లాగ్ కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని