close

తాజా వార్తలు

Published : 26/02/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 5 PM

1. గవర్నర్‌ దత్తాత్రేయను నెట్టేసిన ఎమ్మెల్యేలు

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అనుచిత ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయన్ను నెట్టేశారు. దీనిపై అధికార భాజపా మండిపడింది. దీనికి కారణమైన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌కు భాజపా తీర్మానం ప్రవేశపెట్టింది. గవర్నర్‌ను నెట్టేసిన ఘటనను హిమాచల్‌ సీఎం జైరాం ఠాకూర్‌ ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గుంటూరు మేయర్‌ పీఠం మాదే: కన్నా

ఏపీ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధి భాజపా-జనసేన గెలుపుతోనే సాధ్యమని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని ఆయన నివాసంలో భాజపా-జనసేన నేతల సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం కన్నా మీడియాతో మాట్లాడారు. భాజపా-జనసేన అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీల్లో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలు పెంపు

* వాళ్లు ప్రజాసేవ చేయరు.. చేయనివ్వరు: పవన్

3. నిజమెవరిదో అర్థం కావట్లేదు: డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఇప్పటివరకు 32 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశామని టీఎస్‌పీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌ గంటా చక్రపాణి చెబుతుంటే.. మంత్రి కేటీఆర్‌ మాత్రం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ

గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకేసు వివరాలను రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మీడియాకు వెల్లడించారు.  ‘‘అనూషను సహ విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డే హత్య చేశాడు. వేరే యువకుడితో చనువుగా ఉందని విష్ణుకి అనుమానం వచ్చింది. దీంతో ..ఈనెల 24న అనూషను నరసరావుపేట శివారుకు తీసుకెళ్లాడు. ఆమెను నిలదీయడంతో పాటు గొడవపడ్డాడు. కోపంతో ఆమె గొంతు నులిమి చంపాడు. హత్య తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని చూశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో జగిత్యాల వాసి విన్యాసాలు

అమెరికాలోని మ్యాడిసన్‌ నగరంలో ఘనీభవించిన సరస్సుపై జగిత్యాల జిల్లా వాసి సూర్య నమస్కారాలతో ఆకట్టుకున్నాడు. సరస్సుపై 23 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి అబ్బురపరిచాడు. మెట్‌పల్లి మండలం వెళ్లుల్లకు చెందిన ప్రవీణ్‌ ఇప్పటికే పలు సాహసాలు చేశాడు. నాలుగేళ్లలో 11 పర్వతాలు అధిరోహించి ప్రశంసలందుకున్నాడు. వడోదరలో యోగా శిక్షకుడిగా పనిచేసిన ప్రవీణ్‌ ఇప్పటివరకు మణి మహేశ్‌ కైలాష్‌, ఎవరెస్ట్‌‌, మేరా పర్వతం సహా ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియాలోని పలు పర్వతాలను అధిరోహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మార్కెట్లకు బ్లాక్‌‌ ఫ్రైడే

శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు మరో బ్లాక్‌‌ ఫ్రైడేని చవిచూశాయి. సూచీలు ఒకేరోజు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 50,256 వద్ద, నిఫ్టీ 14,888 వద్ద ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. ఇంట్రాడే ఏ దశలోనూ సూచీలకు మద్దతు లభించకపోవడంతో అంతకంతకూ దిగజారుతూపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 1939 పాయింట్ల నష్టంతో 49,099 వద్ద ముగియగా.. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.14 వద్ద నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘పాంచ్‌’ పటాకా.. మోగిన ఎన్నికల నగారా

పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. ఈ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సమయం కోసం వేచిచూశా: అక్షర్‌ పటేల్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో అక్షర్‌ పటేల్‌ 11/70 అత్యుత్తమ ప్రదర్శన చేయడం ద్వారా తన రెండో టెస్టులోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఇదంతా ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైందని గుజరాత్‌ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు అనంతరం టీమ్‌ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా పటేల్‌ పలు విషయాలు పంచుకున్నాడు. మూడేళ్లుగా తాను టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నానని, ఆ సమయంలో తన ఆటలో మెరుగుపడాల్సిన అంశాలపై దృష్టిసారించానని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వాళ్లనెవరూ అడగరు.. స్పిన్నర్ల విషయంలోనే ఇలా!

9. కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్‌ లేదు కానీ..

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే పది రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కమిటీలను పంపింది. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర, కేరళల నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించట్లేదు కానీ ఆంక్షలను కఠినం చేస్తున్నట్లు మంత్రి విజయ్‌ వడ్డేతివార్‌ తెలిపారు. నాగ్‌పూర్‌లో శుక్రవారం మంత్రి కరోనా కట్టడి చర్యల గురించి వివరించారు. కరోనా కేసుల్లో పెరుగుదలకు ఒక కారణంగా భావిస్తున్న లోకల్‌ ట్రైన్ల సంఖ్యను తగ్గిస్తున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లగేజ్‌ లేకపోతే.. విమాన టికెట్‌పై డిస్కౌంట్‌

లగేజ్‌ లేకుండా భారత్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే త్వరలో మీ ప్రయాణం కాస్త చౌక కానుంది. ఇకపై చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా దేశీయ విమాన సంస్థలకు డీజీసీఏ అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లొచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళ్లాలంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని