Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 12/05/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. Ruia మృతులు 11 కాదు 23: నారాయ‌ణ‌

రుయా ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ అంద‌క‌ 11 మందే చ‌నిపోయార‌ని ప్ర‌భుత్వం అస‌త్యం చెబుతోంద‌ని సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అన్నారు. మొత్తం 23 మంది చ‌నిపోయారంటూ వారి పేర్ల‌తో సహా వివ‌రాలు తెలిపారు. మృతులను కె.బాలు, జయచంద్ర, రామారావు, రమేశ్‌ బాబు, భువనేశ్వరి బాబు, కలందర్‌, రమణాచారి, ప్రభాకర్‌, మహేంద్ర, షాహిద్‌, గజేంద్రబాబు, పుష్పలత, మహమ్మద్‌ పాషా, వేణుగోపాల్‌, గౌడ్‌ భాషా, రాజమ్మ, మదన్మోహన్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, సుబ్రమణ్యం, బి.సులోచన, తనుజరాణి, పజులాల్‌, వెంకట సుబ్బయ్యగా వెల్ల‌డించారు. ఆక్సిజ‌న్ విష‌యంలో రాష్ట్ర  ప్ర‌భుత్వం కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌లేక‌పోతుంద‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. 

Remdesivir: ఏలూరులో ముఠా అరెస్ట్‌

2. గని పేలుడుపై వాస్తవాలు బయటకు రావట్లేదు’

మామిళ్లపల్లె గనుల పేలుడు ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు లీజుదారుగా వైకాపా ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉందని బీటెక్‌ రవి చెప్పారు. 2001 నుంచి 2022 వరకు లీజు పరిమితి ఉన్నట్లు తెలిపారు. గని యజమానిగా పేర్కొన్న నాగేశ్వర్‌రెడ్డిపై చాలా కేసులున్నాయని.. గతంలోనూ ఆయన జైలుకెళ్లి వచ్చారన్నారు.

3. రాజమహేంద్రవరానికి ధూళిపాళ్ల తరలింపు

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అరెస్టయిన తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు మళ్లీ రాజమహేంద్రవరం తరలించారు. కరోనా సోకడంతో ఇప్పటి వరకు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందారు. తాజాగా నరేంద్రకు కరోనా నెగటివ్‌ రావడంతో తిరిగి తీసుకెళ్లారు. తొలుత అరెస్ట్‌ చేసిన అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే ఆయన్ను ఉంచారు. అయితే అక్కడ నరేంద్రకు కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు. 

4. మీ అమ్మకు చెప్పు.. నేను సీఎం అవుతానని

ఆ అబ్బాయి వయసు 22ఏళ్లు.. అమ్మాయికి 17ఏళ్లు. తొలి చూపులోనే అతను ఆమెను ఇష్టపడ్డాడు. అదే మాట ఆమెకి చెబితే.. ‘‘భవిష్యత్తులో ఏం ఉద్యోగం చేస్తాడని ఇంట్లో అడిగితే ఏం చెప్పను’’ అంది ఇష్టాన్ని పరోక్షంగా వ్యక్తపరుస్తూ..! అప్పుడు ఆ యువకుడు ఏ మాత్రం తడుముకోకుండా  ‘‘మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినవుతా’’ అని అన్నాడట..! 30ఏళ్ల క్రితం ఓ జంట మధ్య జరిగిన సంభాషణ ఇదీ. ఆ అబ్బాయి మరెవరో కాదు.. అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ. ఆ అమ్మాయే.. పదేళ్ల తర్వాత తాను పెళ్లాడిన రినికి భుయాన్‌. హిమంత సీఎం అయిన సందర్భంగా ఆనాటి సంగతులను పంచుకున్నారు ఆయన సతీమణి. 

5. 500 రాకెట్లను తట్టుకొన్న ఉక్కుగొడుగు అది..!

ప్రతి మూడు నిమిషాలకో రాకెట్‌ గర్జనతో ఇజ్రాయెల్‌ దద్దరిల్లిపోయింది. అయినా కానీ, అతిస్వల్ప నష్టంతో బయటపడింది. ప్రత్యర్థులపై దాడులు నిర్వహించింది. కేవలం ఒక రక్షణ వ్యవస్థే ఇజ్రాయెల్‌ను కాపాడిందని చెప్పాలి. అదే ‘ఐరన్‌డోమ్‌’ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌. పదేళ్ల క్రితం సేవలు అందించడం ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇప్పటి వరకు వేల కొద్దీ రాకెట్లను గాల్లోనే ధ్వంసం చేసింది. ఒక రకంగా గతం పరిశీలిస్తే.. ఐరన్‌డోమ్‌ వచ్చాక.. రాక ముందు అన్నంత మార్పు కనిపిస్తుంది. తాజాగా ఇజ్రాయెల్‌-పాలస్తీనాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో మరోసారి ఈ గగనతల రక్షణ వ్యవస్థ వార్తలో కేంద్రబిందువుగా నిలిచింది.

6. దేశం దుఃఖిస్తుంటే.. సానుకూల ప్రచారమా?

దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ ఆందోళన కలిగిస్తున్న వేళ ‘సానుకూల ఆలోచనా ధోరణి’ పేరిట భాజపా చేస్తున్న ప్రచారం కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ‘‘సానుకూల ఆలోచన పేరిట ఇచ్చే ధీమా.. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, వైద్యారోగ్య సిబ్బంది, ఆక్సిజన్‌, ఔషధాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని అపహాస్యం చేయడమే. ఒకరి తలను ఇసుకలో ముంచడం సానుకూలమైన అంశం కాదు- మన పౌరులకు ద్రోహం చేయడమే’’ అని రాహుల్‌ ట్విటర్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

7. Stock Market: వరుసగా రెండో రోజూ నష్టాలే!

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా నష్టాల్లో పయనించాయి. చివరకు సెన్సెక్స్‌ 471 పాయింట్లు నష్టపోయి 48,690 వద్ద.. నిఫ్టీ 151 పాయింట్లు దిగజారి 14,696 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.42 వద్ద నిలిచింది. కమొడిటీ ధరలు దూసుకెళ్లడంతో ద్రవ్యోల్బణ భయాలు పెరిగి అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 

8. Black Fungus: మహారాష్ట్రలో 2వేల కేసులు!

దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా బాధితులను బ్లాక్‌ఫంగస్‌ వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్రలోనూ దాదాపు 2వేలకు పైగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ముందుజాగ్రత్తగా అక్కడి మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ప్రత్యేక చికిత్స కేంద్రాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది.

9. B.1.617: WHO అలా చెప్పలేదు

బి.1.617.. భారత్‌ రకం స్ట్రెయిన్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. భారత రకం కరోనా వైరస్‌ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది. ‘‘బి.1.617 వైరస్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి.1.617ను ‘భారత వేరియంట్‌’ అని పేర్కొన్నారు. 
10.
Immunityని పెంచే హైడ్రోజన్‌ వాటర్‌

కరోనా విజృంభణ వేళ ఆక్సిజన్‌ అందక మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో లోటుపాట్లు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు ప్రత్యేక అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌లోని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ. హైడ్రోజన్‌ గ్యాస్‌తో కూడిన ఈ నీళ్లను తాగితే కరోనా రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కరోనా చికిత్సలో హైడ్రోజన్‌ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని