
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. పెద్దల పండుగ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నవ్య కాంతులు తీసుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విటర్లో సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసే ఈ సంక్రాంతిని పెద్దల పండుగగా కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ‘‘ సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే ఈ రోజు సానుకూల మార్పునకు ప్రతీక. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లోకి నవ్యకాంతులు తీసుకురావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఉపరాష్ట్రపతి ట్విటర్లో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రామతీర్థంలో చినజీయర్ స్వామి పర్యటన
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కోదండ రామాలయాన్ని సందర్శించారు. అక్కడ కొండపైన ఆలయంలో దుండగులు ధ్వంసం చేసిన స్వామివారి విగ్రహం, ధ్వంసమైన స్వామివారి విగ్రహం లభించిన కొలనును పరిశీలించారు. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడి అధికారులు ఆయనకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ
ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. మూడు రోజుల పోలీసు కస్టడీ ఇవాళ ముగిసింది. అంతకుముందు బేగంపేటలోని పీహెచ్సీలో భూమా అఖిలప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా నిర్ధరణ అయింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం అఖిలప్రియను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల తర్వాత ఆమెను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. భారత్‌లో 109కు చేరిన కరోనా కొత్తరకం కేసులు
భారత్‌లో కొత్తరకం కరోనా(యూకే స్ట్రెయిన్) కేసుల సంఖ్య 109కు చేరిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ గురువారం వెల్లడించింది. సాధారణ కరోనా వైరస్ కంటే త్వరితంగా వ్యాపించే కొత్తరకం (యూకే స్ట్రెయిన్) కరోనాను బ్రిటన్‌లో గుర్తించినప్పటి నుంచి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబరు 22 నుంచి యూకే నుంచి విమానాలను నిషేధించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 1.22 శాతానికి తగ్గింది. నవంబర్‌లో ఇది 1.55%, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్‌లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌కు 0.92 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. డిసెంబర్లో కూరగాయాల టోకు ధరలు (-) 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. నవంబర్‌లో ఇది 12.24 శాతంగా ఉండేదని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పల్స్ పోలియో తేదీ ఖరారు
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని తొలుత కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో పల్స్ పోలియో కార్యక్రమం తేదీని మార్చినట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. గావస్కర్ ఏమైనా అనుకోని.. పర్లేదు: టిమ్‌పైన్
టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు తనని ఏమాత్రం ప్రభావితం చేయవని, తన గురించి ఏమైనా అనుకోవచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ అన్నాడు. మూడో టెస్టు చివరి రోజు భారత బ్యాట్స్‌మెన్ రవిచంద్రన్ అశ్విన్(39*), హనుమ విహారి(21*) బ్యాటింగ్ చేస్తుండగా, పైన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అశ్విన్‌ను అతడు దూషించిన వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారడంతో అదే రోజు గావస్కర్ స్పందించాడు. ఆసీస్ కెప్టెన్‌గా పైన్ రోజులు దగ్గరపడ్డాయన్నాడు. ఈ మ్యాచ్‌లో పైన్ ప్రవర్తన బాగోలేదని, కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాడని గావస్కర్ విమర్శించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
9. జల్లికట్టు వేడుకల్లో రాహుల్ గాంధీ!
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రసిద్ధి చెందిన మధురైలోని అవనియపురంలో తొలుత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు. ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రివ్యూ: రెడ్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
