close

తాజా వార్తలు

Published : 02/01/2021 08:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 AM

1. టీకాకు ఓకే!

భారత్‌లో కొవిడ్‌-19 నిర్మూలనకు సమర శంఖం మోగింది. దేశంలో ఈ మహమ్మారిని తుదముట్టించే టీకా కార్యక్రమానికి ముందడుగు పడింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) ఆధ్వర్యంలోని నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. శుక్రవారం ఇక్కడ సమావేశమైన నిపుణుల బృందం.. ఈ టీకాకు షరతులతో కూడిన వినియోగానికి అనుమతివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కుల దురహంకారంతోనే పరువు హత్యలు

కులాంతర వివాహాలు పరువు ప్రతిష్ఠలతో ముడిపడి ఉన్నాయి. పరువు హత్యలన్నీ కుల దురహంకార హత్యలే.. ఇవి సామాజిక వ్యవస్థలో పేరుకుపోయిన భావన అని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషియల్‌ సైన్సెస్‌(టిస్‌) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌, సైకాలజీ ప్రొఫెసర్‌ యు.వింధ్య అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో, నిజామాబాద్‌లో రెండు ప్రేమజంటలు బలవన్మరణాలకు పాల్పడటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ప్రేమను అంగీకరించలేదని జనగామ జిల్లాలో ఇద్దరు మైనర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొత్త ఏడాదీ.. అదే ఒరవడి: కేటీఆర్‌

కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. 2020 గందరగోళ సంవత్సరమని, అది విలువైన జీవిత పాఠాలను నేర్పిందని తెలిపారు. ‘‘2021లో సానుకూలతలను అందిపుచ్చుకొని ఆశావాదంతో ముందుకు సాగుదాం. ఈ సంవత్సరంలో అందరికీ సంకల్పబలం, సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం సిద్ధించాలి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆవిర్భావం నుంచి అప్రతిహతంగా ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ 2021లోనూ అదే ఒరవడిని కొనసాగిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రుణాల గుట్టు.. ‘గేట్‌వే’లకెరుక!

యాప్‌ల ద్వారా రుణాలిచ్చి రూ.వేల కోట్లు కొల్లగొట్టిన చైనా సంస్థల గుట్టంతా పేమెంట్‌ గేట్‌వేలు, వర్చువల్‌ ఖాతాల్లో ఉందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు. కంపెనీల వ్యవహారాలను నడిపిస్తున్న జెన్నీఫర్‌ పక్కా ప్రణాళికతో ఇదంతా చేసినట్లు భావిస్తున్నారు. రుణం వసూలు, వడ్డీరూపంలో వచ్చే రూ.వేల కోట్ల ఆదాయం బహిర్గతం కాకుండా డిజిటల్‌ నగదును బదిలీ చేసే పేమెంట్‌ గేట్‌వేలు, వర్చువల్‌ ఖాతాల వ్యవహారాల్లోని లోపాలను యాప్‌ నిర్వాహకులు గుర్తించి రూ.21 వేల కోట్లను కొల్లగొట్టారు. ఈ సొమ్మంతా ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో పోలీసులు పరిశోధన కొనసాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 70 లక్షల మందికి టీకాలివ్వడమే సవాల్‌

కొవిడ్‌ టీకా త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. తొలివిడత టీకాల పంపిణీలో అర్హులైన వారిని గుర్తించి టీకాను అందించడం సవాలుగా మారింది. ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు వైద్యంలో పనిచేస్తున్న సిబ్బంది సమాచారంలో మాత్రమే స్పష్టత ఉంది. ఇంకా పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితర ముందు వరుసలో(ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌) నిలిచే ఇతర సిబ్బంది సమాచారాన్నీ సేకరిస్తున్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే సుమారు 5 లక్షల మంది ఉంటారని అంచనా. అసలు సమస్యంతా 50 ఏళ్లు పైబడిన వారిని, 18-50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడంలోనే ఎదురవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డబ్బీ బాడిగకు డబ్బే డబ్బు

మేలైన రకం డబ్బీ బాడిగ (బ్యాడిగి) మిర్చి.. రైతుకు కనకవర్షం కురిపిస్తోంది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్న బ్యాడిగి కొత్త ఏడాది తొలిరోజున మరో రికార్డు సృష్టించింది. కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావి తాలూకా పాణిగట్టి గ్రామానికి చెందిన చెన్నప్పగౌడ బ్యాళిగౌడ క్వింటాలు మిరపను రూ.55,239కు విక్రయించారు. మార్కెట్‌ యార్డులో ఆ రైతు రెండు క్వింటాళ్ల మిరపను ఎ.హెచ్‌.నాసిపుర అనే వ్యాపారికి ఈ ధరకు విక్రయించారు. గత సోమవారం గదగ్‌ జిల్లా బెటెగేరి గ్రామ రైతు మల్లికార్జున బసప్ప కరిమిష్టి క్వింటాలు మిరపను రూ.50,111కు విక్రయించడం ఇప్పటి వరకు రికార్డు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు ఓ ‘అద్భుత క్షణం’

ఐరోపా యూనియన్‌(ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమించే ప్రక్రియ(బ్రెగ్జిట్‌) లాంఛనంగా పూర్తి కావడంపై ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి అదో అద్భుతమైన క్షణంగా అభివర్ణించారు. బ్రిటన్‌ సభ్యత్వం మన స్వాతంత్య్రం మన చేతుల్లోనే ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన సంవత్సర సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఐక్యంగా నిలవాలన్న దేశ ప్రజల బలమైన ఆకాంక్ష వల్లే ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ కలసి యునైటెడ్‌ కింగ్‌డమ్‌గా ఏర్పడ్డాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డి‘సంబరం’

పండగ సీజను అనంతరమూ వాహన విక్రయాల్లో వృద్ధి కొనసాగింది. డిసెంబరులో ప్రోత్సాహకర రీతిలో అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా దేశీయ వాహన దిగ్గజాలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ 20 శాతానికిపైగా వృద్ధితో ఆకట్టుకున్నాయి. మారుతీ మొత్తం అమ్మకాల్లో 20.2 శాతం, దేశీయ అమ్మకాల్లో 17.8 శాతం వృద్ధి లభించిది. ఈ సంస్థ మినీ కార్ల విభాగంలో 2019 డిసెంబరులో 23,883 అమ్మకాలు నమోదుకాగా.. కిందటి నెలలో 4.4 శాతం పెరిగి 24,927 వాహనాలకు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇంగ్లాండ్‌లో సాధన.. ఉత్తమ నిర్ణయం

కొవిడ్‌ సమయంలో ఇంగ్లాండ్‌కు వెళ్లి సాధన చేయాలనుకోవడం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పి.వి.సింధు చెప్పింది. ఈ నెల 12న ఆరంభమయ్యే థాయిలాండ్‌ ఓపెన్‌కు ఆమె లండన్‌ నుంచే వెళ్లనుంది. ‘‘భారత్‌లో కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు వెళ్లి సాధన చేయాలనుకోవడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటి. ఇక్కడ చలి మరీ ఎక్కువగా ఉండటం ఇబ్బందే కానీ.. ఎంతో తీవ్రతతో సాగిన శిక్షణ కార్యక్రమాలను బాగా ఆస్వాదించా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొత్త వత్సరం..చిత్ర తోరణం

కొత్త క్యాలెండర్‌లో తొలి రోజుకి ఘనంగా స్వాగతం చెప్పేశాం. డైరీలో తొలి పేజీని తెరిచాం. చిత్రసీమ కూడా కొత్త కలలు, నూతన లక్ష్యాలకి రెక్కలు తొడిగింది. ప్రచార హోరుతో కొత్త యేడాదికి శ్రీకారం చుట్టింది. సెట్స్‌పై ఉన్న పలు సినిమాల ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. కొత్త యేడాది మొదలవుతోందనగా రాత్రి 12 గంటల నుంచే సందడి షురూ అయ్యింది. పవన్‌కల్యాణ్, ప్రభాస్‌ మొదలుకొని పలువురు కథానాయకులు నటించిన సినిమాల తాలూకూ ఫస్ట్‌లుక్‌లు, ట్రైలర్లు,  ప్రచార చిత్రాలు  విడుదలయ్యాయి. వీటిని చూసుకుంటూ మురిసిపోవడం అభిమానుల వంతైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని