close

తాజా వార్తలు

Published : 25/02/2021 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. వరి సాగులో తెలంగాణ టాప్‌

ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌ వరి సాగు విస్తీర్ణంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. బుధవారానికి అరకోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి నాట్లు వేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ తాజాగా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తెలంగాణలో రబీలో అరకోటి ఎకరాల్లో 27.12 లక్షల మంది రైతులు వరి సాగు చేయడం గత చరిత్రలో ఎన్నడూ లేదు. తెలంగాణ తరువాతి స్థానాల్లో తమిళనాడు 26 లక్షలు, ఏపీ 17.60 లక్షల ఎకరాలతో వరసగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్లగ్‌లో పెడదాం.. పరుగున వెళదాం

పెట్రో ధరలు మండిపోతున్నాయి. వందకు దగ్గర అవుతున్నాయి. ఇది వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. భారం అమాంతం పెరుగుతోంది. ప్రస్తుతం వాహనం అందరికీ తప్పనిసరి వస్తువుగా మారింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌లు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. నిర్వహణ వ్యయం కనిష్ఠ స్థాయిలో ఉండడంతో పాటు కాలుష్య సమస్య ఉండదు. సులభ వాయిదాల్లో అందించేందుకు నెడ్‌క్యాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాపూ.. చూస్తున్నావా నీ దేశాన్ని!

భారతమాత అంటూ దేశాన్ని తల్లిలా భావించే దేశంలో.. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. బయటకు వెళ్లింది మొదలు ఇంటికి వచ్చేవరకు భయంతో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఆగంతుకుడు, పరిచయస్థుడు, బంధువు.. ఇలా ఎవరి రూపంలో మృగాడు దాగున్నాడో? అని అనుక్షణం ‘భయం’కరమైన మానసిక క్షోభ అనుభవించాల్సిన దుస్థితి. అత్యాచారానికి యత్నించడం.. కాదంటే కిరోసిన్‌ పోసి కాల్చేయడం.. ప్రతిఘటిస్తే కత్తితో పొడవడం.. ఎదురు తిరిగితే చావబాదడం. ఇవీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం ఒక్కరోజే వెలుగులోకి వచ్చిన ఘోరాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అజాగ్రత్తే కొంప ముంచుతోంది!

తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కొవిడ్‌ ప్రస్తుతం అదుపులోనే ఉన్నా.. గత కొద్దిరోజులుగా కరీంనగర్‌, జగిత్యాల, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర కొన్ని జిల్లాల్లో కేసుల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది.  కరోనా వైరస్‌ అదుపులోనే కొనసాగాలంటే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో సూచించారు. ముఖ్యాంశాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళి!

సమాచార నియంత్రణ విషయమై ట్విటర్‌తో నెలకొన్న వివాదం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కొత్త నిబంధనల అమలుకు భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకుగాను ‘మార్గదర్శకాలు, డిజిటల్‌ మీడియా నియమావళి’కి సంబంధించి ముసాయిదా తయారైనట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. అందులోని కీలకాంశాలను వెల్లడించింది. చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు 2018 నుంచి ప్రభుత్వం కఠిన నిబంధనల రూపకల్పనకు యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!

గ్యాస్‌ సిలెండర్‌ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం. కానీ విమల్‌డిగే మాత్రం సిలెండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు. పుణెకు చెందిన విమల్‌ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్‌ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే పనులను చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. కూరగాయలు, పండ్లు, బియ్యం కడిగిన నీళ్లను పెరట్లోని మొక్కలకు పోసేవారు. నెలవారీ సరుకులు కొనాలన్నా కాటన్‌ బ్యాగునే తీసుకెళ్లేవారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 7. పటేల్‌ పోయి.. మోదీ వచ్చె

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతేరా మైదానానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేయడంపై బుధవారం దుమారం చెలరేగింది. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ను ప్రభుత్వం అవమానించిందంటూ కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. వాటిని భాజపా తిప్పికొడుతూ పటేల్‌ గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. ‘మొతేరా’కు గతంలో సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా పేరుండేది. పునర్నిర్మాణం తర్వాత దాని పేరును ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా మార్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!

‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌యాప్‌ సభ్వత్యం నెలకు రూ.129. అయితే రూ.20 ఇస్తే ఓటీపీ చెబుతాం.. తీసుకోండి.. ఆనందించండి. నెట్‌ఫ్లిక్స్‌ రెండు నెలల చందా రూ.25కే ఇస్తాం..’ అంటూ సైబర్‌ నేరస్థులు ప్రచారం చేసుకుంటున్నారు.. టెలిగ్రామ్‌ మెసెంజర్‌లో వీరిస్తున్న ప్రకటనలు చూసి వందలసంఖ్యలో యువకులు, విద్యార్థులు టెలిగ్రాం మెసెంజర్‌ బృందంలో సభ్యులై రూ.20, రూ.25 నగదు బదిలీ చేసుకుని ఓటీపీలు తీసుకుంటున్నారు. ఒక యువతిని వేధించిన కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడి ఫోన్‌ను బుధవారం పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమ్మాయి జాగ్రత్త!

కౌమారం ఎగసిపడే జలపాతంలాంటిది... అందంగా కనిపించే ఆ ప్రవాహంలో సుడులెన్నో ఉంటాయి. అప్రమత్తంగా లేకపోతే పాతాళానికి జారిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి తల్లిదండ్రులేం చేయాలి? అందుకోసమే ఈ చెక్‌లిస్ట్‌ అని చెబుతున్నారు మానసిక వైద్యురాలు గౌరీదేవి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘మాస్క్‌ అక్కర్లేదు.. వచ్చేయండి!’

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు సాధారణ జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మాస్క్‌ ధరించడం అందరికి అలవాటైపోయింది. బయటకు వస్తే చెప్పులు వేసుకోవడం ఎంత సాధారణమో.. మాస్కు ధరించడం అంతే సర్వ సాధారణమైంది. కానీ, అమెరికాలో ఓ రెస్టారంట్‌ మాత్రం ఆ నిబంధనలను గాలికి వదిలేయడమే కాదు.. మాస్కే అవసరం లేదు.. అందరూ రావొచ్చని బోర్డు పెట్టింది. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని