Delhi: ఇక నుంచి ప్రభుత్వం అంటే ఎల్జీనే
close

తాజా వార్తలు

Published : 28/04/2021 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Delhi: ఇక నుంచి ప్రభుత్వం అంటే ఎల్జీనే

అమలోకి వచ్చిన వివాదాస్పద చట్టం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఇక నుంచి ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. ఈ మేరకు వివాదాస్పద ‘ది గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ(సవరణ) చట్టం-2021’ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త చట్టం ప్రకారం.. దిల్లీలో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎల్జీ అనుమతి తప్పనిసరి. ఏప్రిల్‌ 27 మంగళవారం నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కరోనా రెండో దశ ఉద్ధృతితో సతమతమవుతున్న సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

దిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా తీసుకొచ్చిన ఈ సవరణ బిల్లు. ఈ ఏడాది మార్చిలో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఆందోళనల నడుమే మార్చి 22న లోక్‌సభలో, మార్చి 24న రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారింది. ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో చీకటి రోజు’’ అని బిల్లు ఆమోదం సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రభుత్వం అధికారాలను కాలరాయడమంటే.. ప్రజలను అవమానించినట్లే అని అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని