ఏపీ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 13:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

అమరావతి: రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో 3నెలల కాలానికి రూపొందించిన బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి అంటే జూన్‌ నెలాఖరు వరకు రమారమి రూ.86 వేల కోట్ల మేర ఓటాన్‌ అకౌంట్‌కు ఆమోదం లభించింది. 

వరుసగా మూడో ఏడాదీ
రాష్ట్రంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించడానికి వీలు చిక్కలేదని, అందువల్ల ఓటాన్‌ అకౌంట్‌ను ఆమోదిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది.
 కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, ఇతర చెల్లింపులు జరపాలన్నా బడ్జెట్‌ ఆమోదం తప్పనిసరి. అది వీలుకానప్పుడు ఓటాన్‌ అకౌంట్‌ ఆమోదిస్తారు.
* ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడేళ్లుగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఆమోదించడం ఇదే తొలిసారి.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికల కారణంగా తొలుత మూడు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆనక పూర్తిస్థాయి బడ్జెట్‌ను కొత్త ప్రభుత్వం ఆమోదించుకుంది.
* 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా బడ్జెట్‌ సమావేశాలకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో ఆ ఏడాదీ తొలుత ఓటాన్‌ అకౌంట్‌కు ఆర్డినెన్సు ఇచ్చారు.
* ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఓటాన్‌ అకౌంట్‌ను ఆర్డినెన్సు జారీ చేశారు. జూన్‌ నెలాఖరులోపు తిరిగి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆమోదించుకోవాల్సి ఉంటుంది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని