
తాజా వార్తలు
మహిళలకు గవర్నర్, కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాధనకు మహిళా సాధికారత చాలా కీలకమన్నారు.మహిళ అభివృద్ధే కుటుంబ అభివృద్ధి అని తెలిపారు. కొవిడ్ సమయంలో వివిధ రంగాల్లో మహిళలు చేసిన సేవలను ఆమె కొనియాడారు.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో,అభివృద్ధిలోనూ అతివలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్ నగర మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి
Tags :