ప్రజా చైతన్యంతోనే కొవిడ్ కట్టడి: తమిళిసై
close

తాజా వార్తలు

Published : 24/04/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజా చైతన్యంతోనే కొవిడ్ కట్టడి: తమిళిసై

హైదరాబాద్: వెంటిలేటర్లు, ఔషధాలు, ఆక్సిజన్ ఎంత సమకూర్చినప్పటికీ ప్రజా చైతన్యంతోనే కొవిడ్ మహమ్మారిని నియంత్రించగలమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా నివారణ పద్ధతులు, వ్యాక్సినేషన్‌పై మరింత అవగాహన పెంచేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆమె సూచించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యాశాఖాధికారులతో పుదుచ్చేరి నుంచి గవర్నర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

కొవిడ్ ఉద్ధృతమవుతున్న సందర్భంలో ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడం అత్యంత ఆవశ్యకమన్నారు. సరైన విధంగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, గుంపులుగా గుమిగూడకుండా ఉండటం లాంటివి కరోనా నివారణ, నియంత్రణలో అత్యంత కీలకమని తమిళిసై స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లోని ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు, రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ దిశగా వినియోగించుకోవాలని సూచించారు. కరోనా బారిన పడుతున్న వారిలో దాదాపు 40 శాతం మంది యువకులే ఉండడం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. వినూత్న పద్ధతుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షలు జరుగుతున్న తీరును తమిళిసై సమీక్షించారు. ఆన్‌లైన్ క్లాసులు అందుకోలేకపోయిన విద్యార్థుల కోసం డిజిటల్ రిసోర్సెస్ సిద్ధం చేయాలని ఆదేశించారు. పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ రూపొందించడంతో పాటు వారిని ఛాన్స్‌లర్‌ కనెక్ట్ అల్యూమ్నిలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యాసంస్థల్లో చేపట్టిన కొవిడ్ నియంత్రణ చర్యలు, ఆన్‌లైన్‌ విద్యాబోధన, సంబంధిత చర్యలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ గవర్నర్‌కు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని