close

తాజా వార్తలు

Published : 04/05/2021 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IPL: జీపీఎస్‌ బ్యాండ్లు పనిచేయలేదా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహణ కోసం సృష్టించిన బయో బుడగలో లోపాలున్నాయా? ఆటగాళ్లకు ఇచ్చిన జీపీఎస్‌ ట్రాకింగ్‌ బ్యాండ్లు పనిచేయలేదా? వాటి నాణ్యత అంతత మాత్రమేనా?  కదలికలను ఏ మాత్రం గుర్తించి రికార్డు చేయలేదా? అంటే కొన్నింటికి ఔననే సమాధానం వస్తోంది!

లీగ్‌ కోసం బీసీసీఐ భారీ బుడగలను సృష్టించింది. మొదట ముంబయి, చెన్నైలో వీటిని ఏర్పాటు చేసింది. ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం వంటివన్నీ బాగానే చేసింది. అయితే ఆటగాళ్ల కదలికలను గుర్తించడానికి ఇచ్చిన బ్యాండ్లు మాత్రం సరిగ్గా పనిచేయలేదని తెలుస్తోంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్తే కనీసం ఆ సమాచారాన్నీ బ్యాండ్లు రికార్డు చేయలేదట.

ఆటగాళ్లకు ఎఫ్‌ఓబీ అనే జీపీఎస్‌ ట్రాకింగ్‌ బ్యాండ్లను బీసీసీఐ అందించింది. వీటిని చెన్నైలోని ఓ సంస్థ తయారు చేసింది. అయితే అవి నాణ్యంగా లేవని, ఉన్నత ప్రమాణాలు కనిపించలేదని ఫ్రాంచైజీ వర్గాలు అంటున్నాయి. బ్యాటరీ త్వరగా అయిపోయేదని, బ్లూటూత్‌, జీపీఎస్‌ ద్వారా అది కదలికలను సరిగ్గా గుర్తించేది కాదని పేర్కొన్నాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లినా గుర్తించేది కాదని వెల్లడించాయి. యూఏఈలో జరిగిన గత సీజన్‌కు బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ బుడగ వ్యవహారమంతా చూసుకుంది. కానీ ఈసారి పూర్తిగా బోర్డే అన్నీ చూసుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని