CoronaVirus: గోమూత్రంతో మాత్రలు
close

తాజా వార్తలు

Published : 09/05/2021 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoronaVirus: గోమూత్రంతో మాత్రలు

గోశాలలో కొవిడ్‌కేర్‌ సెంటర్‌

బనస్కాంత: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో గుజరాత్‌లోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి బాధితులకు గోమూత్రంతో తయారు చేసిన మాత్రలను అందిస్తున్నారు. కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో గ్రామాల్లోనూ కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని గుజరాత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో బనస్కాంత జిల్లాలోని టేతోడా గ్రామంలోని ఓ గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దానికి ‘వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద్‌ కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌’గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి దేశీ ఆవు మూత్రం, పాలతో తయారు చేసిన ఆయుర్వేదిక్‌ మందులు ఇస్తున్నారు. అవసరమైన వారికి అలోపతి మందులు కూడా అందిస్తున్నారు.

‘స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఏడుగురు చికిత్స పొందుతున్నారు. గోవు పాలు, మూత్రం, నెయ్యితో తయారు చేసిన ఎనిమిది రకాల ఆయుర్వేద మందులను వారికి  అందిస్తున్నాం.’ అని గోశాల నిర్వాహకుడు పేర్కొన్నారు. దగ్గును తగ్గించేందుకు గో మూత్రంతో తయారు చేసిన ‘గో తీర్థ’ అనే మందును ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధితుల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు ఆవు పాలతో తయారు చేసిన ‘చవన్‌ప్రాశ్‌’ను ఇస్తున్నామని వివరించారు. ఈ ఐసోలేషన్‌ సెంటర్‌లో రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు ఆయుర్వేద వైద్యలు, మరో ఇద్దరు ఎంబీబీఎస్‌ వైద్యులు బాధితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితోనే నిర్వాహకులు గోశాలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పటేల్‌ వెల్లడించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని