‘వ్యక్తిగత సేవ చేస్తే ఎంపీ టికెట్‌ ఇస్తారా?’
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వ్యక్తిగత సేవ చేస్తే ఎంపీ టికెట్‌ ఇస్తారా?’

భాజపా ఎంపీ జీవీఎల్‌ విమర్శలు

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో వైకాపా, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విటర్‌లో విమర్శల వార్‌ జరగ్గా ఇవాళ భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ... వైకాపా పై విమర్శల వర్షం కురిపించారు. రేపటితో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ... నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా ఉందన్నారు. తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వైకాపా, తెదేపా సిద్ధమా అని సవాల్ విసిరారు. భాజపా చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. సీఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి ...ఎంపీగా చేసేందుకు అర్హులా? అని తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వటానికి నామినేటెడ్‌ పోస్టులు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్‌ సేవ వర్సెస్‌.. జనం సేవ. దేన్ని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  సోము వీర్రాజుపై విజయసాయి ట్వీట్‌ వైకాపా భయాన్ని స్పష్టం చేసిందని జీవీఎల్‌ విమర్శించారు.

భాజపా, హిందూ ద్రోహుల మధ్యే  పోటీ
భాజపా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ భాజపానే తిరుపతిని అభివృద్ధి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు హిందూయేతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక హిందువులకు సంబంధించింది. ధర్మాన్ని కాపాడే భాజపా..హిందూ ద్రోహులకు మధ్య పోటీ జరుగుతోంది’’ అని వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని