‘నా భర్తను శవాన్ని ఈడ్చినట్లు ఈడ్చుకెళ్లా..’
close

తాజా వార్తలు

Published : 28/03/2021 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నా భర్తను శవాన్ని ఈడ్చినట్లు ఈడ్చుకెళ్లా..’

ఆసుపత్రి ప్రమాదం నుంచి బయటపడ్డ వృద్ధిరాలి దీనగాథ

ముంబయి: ముంబయిలోని షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగి అందులోని కొవిడ్‌ ఆసుపత్రికి మంటలంటుకొని 10 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా మరికొందరు క్షేమంగా బయటపడ్డారు. అలా బయటపడిన మాధురి గోద్వానీ(67) అనే వృద్ధురాలు ఆసుపత్రిలో ఆమె ఎదుర్కొన్న దయనీయ పరిస్థితిని వివరించారు. ‘నా భర్త చేతన్‌ గోద్వానీ(78)కి కరోనా సోకడంతో ఆయనను కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించాం. ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మేము ఉన్న గదిలోకి పొగ వ్యాపించింది. ఓ వార్డు బాయ్‌ హడావిడిగా వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని సూచించి వెంటనే వెళ్లిపోయాడు. గది నిండా పొగ చేరిపోయింది. సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు. ఇక చేసేదేం లేక నా భర్తను శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లినట్లు తీసుకెళ్లాల్సి వచ్చింది’ అని ఆ రాత్రి మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

‘ఇద్దరు వృద్ధులను బయటకు తరలిస్తున్న ఓ మహిళ కనిపించింది. నా భర్తను అలాగే ఈడ్చుకుంటూ ఆమె వెనకాలే వెళ్లాను. ఆ సమయంలో లిఫ్ట్‌ పనిచేస్తోంది. మొదటి అంతస్తు వరకు లిఫ్ట్‌లోనే వెళ్లాం. అక్కడి నుంచి మెట్ల గుండా కిందకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాం. ఆ భయానక దృశ్యాలు నా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి’ అని మాధురి గోద్వానీ పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని