వార్విక్‌షైర్‌కు విహారి
close

తాజా వార్తలు

Published : 07/04/2021 08:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వార్విక్‌షైర్‌కు విహారి

దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు టెస్టు స్పెషలిస్టు హనుమ విహారి ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడబోతున్నాడు. అతడు వార్విక్‌షైర్‌ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పటికే బ్రిటన్‌ చేరుకున్న విహారి.. ఈ సీజన్లో వార్విక్‌షైర్‌ తరఫున కనీసం మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ విషయాన్ని వార్విక్‌షైర్‌ ప్రకటించకపోయినా.. బీసీసీఐ ఖరారు చేసింది. 2019లో చివరిగా దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడిన విహారి.. ఆ తర్వాత వేలంలో అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియాతో భారత్‌ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడికి అవకాశం దక్కలేదు. టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లందరికి (పుజారాతో కలిసి) ఐపీఎల్‌ రూపంలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుండగా.. తనకు ఆ అవకాశం లేకపోవడంతో కౌంటీలకు వెళ్లాలని విహారి నిర్ణయించుకున్నట్లు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని