close

తాజా వార్తలు

Published : 16/02/2021 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సినిమా కోసం స్టెప్పులేస్తున్న హర్భజన్‌ 

సామాజిక మాధ్యమాల్లో భజ్జీ ఫొటోలు..

(ఫొటో: హర్భజన్‌ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ త్వరలో సినిమాల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం భజ్జీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటంలేదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ‘ఫ్రెండ్‌షిప్‌’ పేరిట రూపుదిద్దుకొంటున్న ఆ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఓ పాట చిత్రీకరణలో భాగంగా తీసిన ఫొటోలను టీమ్‌ఇండియా క్రికెటర్‌ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వేసవిలో థియేటర్లలో సందడి చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. ఆ ఫొటోల్లో భజ్జీ డాన్స్‌ చేస్తూ కనిపించాడు. కళ్లోజోడు, తెల్ల బూట్లతో లుంగీ పైకి చుట్టి స్టెప్పులేస్తున్నాడు. కాగా, ఈ సినిమా గతేడాదిలోనే పూర్తి కావాల్సి ఉన్నా..లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. తాజాగా చివరి షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నట్లు భజ్జీ పేర్కొన్నాడు. ఈ వేసవిలో విడుదలవుతుందని చెప్పాడు. మరోవైపు హర్భజన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో ఆడలేకపోయాడు. ఇక త్వరలో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన 292 మంది(వేలంలో పాల్గొనే ఆటగాళ్లు) జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. దీంతో గురువారం అతడిని ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచిచూడాలి.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని