మెదక్‌లో సరిపడా రెమ్‌డెసివిర్‌: హరీశ్‌
close

తాజా వార్తలు

Published : 08/05/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెదక్‌లో సరిపడా రెమ్‌డెసివిర్‌: హరీశ్‌

మెదక్: కలెక్టరేట్‌ సమీపంలోని మర్కెట్‌ కమిటీ ఆవరణలో నూతన దుకాణ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. కరోనా దృష్ట్యా బిహార్‌ కూలీలు వెళ్లిపోవడంతోనే హమాలీల సమస్య ఏర్పడిందన్నారు. ట్రాక్టర్ల్లలో రైస్‌ మిల్లర్లకు ధాన్యం చేరవేయాలని ఆదేశించామన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.4 లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. 6 వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు తేలిందన్నారు. జిల్లాలో 240 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 600 పడకలకు అనుమతిచ్చామని మంత్రి తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర రెమ్‌డెసివిర్‌ నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు సహకరిస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుందని హరీశ్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని