హరియాణాలో రాత్రిపూట కర్ఫ్యూ
close

తాజా వార్తలు

Published : 12/04/2021 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హరియాణాలో రాత్రిపూట కర్ఫ్యూ

గురుగ్రామ్‌: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి. కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్‌ 22 వరకు లాక్‌డౌన్‌ విధించింది. తాజాగా హరియాణా ప్రభుత్వం కూడా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపునిస్తూ.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే అంతర్రాష్ట్ర రాకపోకలపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు హరియాణా పొరుగున్న ఉన్న రాజధాని దిల్లీలోనూ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 92,397 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,491 మందికి పాజిటివ్‌గా తేలింది. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్‌ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.బహిరంగ ప్రదేశాల్లో మాస్కును తప్పని సరి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానా విధించడంతోపాటు.. కేసులు కూడా నమోదు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని