సీఈఎస్‌ 2021: తొలి రోజు హైలెట్స్‌..
close

తాజా వార్తలు

Published : 11/01/2021 23:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఈఎస్‌ 2021: తొలి రోజు హైలెట్స్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అతిపెద్ద సాంకేతిక ప్రదర్శన ‘కన్‌జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ షో’ (సీఈఎస్‌) 2021 సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జనవరి 11 నుంచి జనవరి 14 తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ షోలో ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఎన్నో రకాల కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. ఇందులో భాగంగా తొలిరోజు విడుదలైన వాటి జాబితా ఏంటో చూద్దామా!

*  శాంసంగ్‌ మొత్తం ఆరు ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో క్యూ (క్వాంటమ్ డాట్‌)ఎల్‌ఈడీ సిరీస్‌ టీవీలతో పాటు గృహ అవసరాలకు సంబంధించిన ఇతర పరికరాలను ప్రదర్శించింది. వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సహాయంతో నడిచే జెట్‌బోట్ 90 వాక్యూమ్‌ క్లీనర్‌, లాండ్రీ సేవలను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్ డయల్‌ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌తో పాటు డ్రయర్‌, స్మార్ట్ మీల్‌ ప్లానర్, ఎయిర్‌ పాకెట్ పోర్టబుల్ ఆక్సిజన్‌ డివైజ్‌, ఫేస్‌ మాస్క్‌లు ఉన్నాయి. 

* మరో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కంపెనీ ఎల్‌జీ 55-అంగుళాల ట్రాన్స్‌పరెంట్ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌తో టీవీని తీసుకొచ్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి ఏఐ సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. 

* విలావంతమైన కార్ల తయారీ కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌ 56-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను తీసుకొచ్చింది. దీన్ని తర్వలో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లలో అమర్చనున్నట్లు మెర్సిడెజ్‌ వెల్లడించింది. ఈ స్క్రీన్‌లో ఏఐ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. 

* కొవిడ్‌-19 ప్రభావంతో ఇంటి నుంచే పనిచేసే వారి సంఖ్య పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ బడ్స్‌ని ప్రదర్శించింది. వీటిలో హెచ్‌పీ ఇలైట్‌ డ్రాగన్‌ ఫ్లై జీ2 ల్యాప్‌టాప్‌, ఇలైట్‌ ఫోలియో ట్యాబ్‌, ఇలైట్‌బుక్‌ 840 జీ8 ఏరో, ఇలైట్ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ ఉన్నాయి. 

* లెనోవా యోగా సిరీస్‌లో ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. యోగా స్లిమ్‌ 7ఐ ప్రో పేరుతో 14-అంగుళాల  ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఐరిస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌ ఇస్తున్నారు. 11వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ మొబైల్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, డాల్బీ అట్‌మోస్‌ సౌండ్‌, హర్మాన్‌ స్పీకర్స్‌, ఐఆర్‌ కెమెరా ఉన్నాయి. వీటితో పాటు లెనోవా థింక్‌ రియాలిటీ ఏ3 పేరుతో స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ఆర్‌1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. స్టీరియోస్కోప్‌ 1080పీ డిస్‌ప్లేతో ఐదు వర్చువల్‌ స్క్రీన్‌లను చూపిస్తుంది.  

ఇవీ చదవండి..

ఐఫోన్‌ vs ఆండ్రాయిడ్‌: ఎవరు గెలిచారు?

వాట్సాప్‌ వద్దా..ఇవిగో వీటిని ప్రయత్నించండి..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని