Oxygen: మా కోటాలోంచి వేరే రాష్ట్రాలకివ్వండి
close

తాజా వార్తలు

Published : 13/05/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen: మా కోటాలోంచి వేరే రాష్ట్రాలకివ్వండి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆక్సిజన్‌కు డిమాండ్‌ తగ్గినందున అదనంగా ఉన్న ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆక్సిజన్‌ అవసరం తగ్గిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా అన్నారు. ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ అవుతున్నాయని, ఆక్సిజన్‌కు డిమాండ్‌ తగ్గుతోందని చెప్పారు. 15 రోజుల క్రితం 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం అవ్వగా.. ప్రస్తుతం 582 మెట్రిక్‌ టన్నులు సరిపోతోందన్నారు. తమ అవసరాలకు పోగా మిగిలిన ఆక్సిజన్‌ను అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశామన్నారు. దిల్లీ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం, దిల్లీ హైకోర్టు చూపిన చొరవకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. దిల్లీలో గడచిన 24 గంటల్లో 10,400 మంది కరోనా బారిన పడ్డారని, పాజిటివిటీ రేటు 14 శతానికి పడిపోయిందని సిసోడియా పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని