ఎగిరే వడాపావ్‌ను చూశారా..?
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగిరే వడాపావ్‌ను చూశారా..?

ముంబయి: రజినీకాంత్‌ స్టైల్‌ దోశ గురించి వినే ఉంటాం. మరి ఎగిరే వడాపావ్‌ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఓ వ్యక్తి వినూత్న పద్ధతిలో వడాపావ్‌ తయారు చేస్తూ వార్తల్లో నిలిచారు. ‘ఆమ్‌చి ముంబయి’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ విడుదల చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యాపారి వడాపావ్‌ తయారుచేస్తున్న విధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముంబయిలోని బోరా బజార్‌కు చెందిన 60 ఏళ్ల చరిత్ర ఉన్న ‘రఘు దోశవాలా హోటల్‌’లో ‘ఎగిరే వడాపావ్‌’ను చూడవచ్చు.

ఈ హోటల్‌లో దోశ, ఇడ్లీ వడ, వడాపావ్‌ తదితర ఫలహారాలు లభిస్తాయి. కానీ ఇక్కడ దొరికే వడాపావ్‌ ఎంతో ప్రత్యేకం. దానిని తయారు చేసే వ్యక్తి ఒక చేత్తో గరిట పట్టుకొని దానితో వడను ఎగరేస్తూ.. మరో చేత్తో దానిని పట్టుకొని వడాపావ్‌ తయారు చేస్తున్న విధానం ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి నెటిజన్లు లైకులు కొడుతూ, షేర్‌ చేస్తున్నారు. మార్చి 20న పోస్టు చేసిన ఆ వీడియోను ఇప్పటివరకు 6.8 లక్షల మంది వీక్షించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండి..Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని