మొసళ్లు, చేపలు పీక్కుతిన్న కుమారుడి అవశేషాలతో..
close

తాజా వార్తలు

Updated : 08/03/2021 19:15 IST

మొసళ్లు, చేపలు పీక్కుతిన్న కుమారుడి అవశేషాలతో..

నరకయాతన అనుభవించిన ఓ తండ్రి

పట్నా: కొడుకంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడంటారు. అలాంటి కుమారుడు పసిప్రాయంలోనే కడతేరిపోతే ఆ తండ్రికి తీరని శోకమే మిగులుతుంది. కొడుకు శరీర భాగాలు ఛిద్రమైన స్థితిలో లభిస్తే ఆ నాన్న గుండెలవిసిపోతాయి. ఆ అవశేషాలను ఇంటికి తీసుకెళ్లేందుకు ఎలాంటి సాయం అందక తుండుగుడ్డలో మూట కట్టి, చేతి సంచిలో దాచుకొని కాలినడకన సాగే పయనం నరకప్రాయమే. ఆ నరకయాతనే అనుభవించాడు బిహార్‌లోని భగల్పూర్ జిల్లాకు చెందిన నీరూ యాదవ్‌. 

నీరూయాదవ్‌ కుమారుడు హరైమ్‌ యాదవ్‌ (13) గోపాల్‌పుర్‌ స్టేషన్‌ పరిధి తిర్కాందా సమీపంలో బోటులో నది దాటుతూ ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతయ్యాడు. కాథైర్‌ జిల్లా కుర్సెలా పోలీసు స్టేషన్‌ పరిధి ఘాట్ వద్ద పోలీసులకు హరైమ్‌ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నీరూ యాదవ్‌ అక్కడికి చేరుకున్నాడు. హరైమ్‌ను నదిలోని మొసళ్లు, చేపలు పీక్కుతినగా కొన్ని అవశేషాలు మాత్రమే మిగిలాయి. ఆ అవశేషాలను చూసిన ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.

పోలీసులు సమాచారమయితే ఇచ్చారు కానీ, మృతదేహాన్ని ఇంటికి తరలించే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తనతో తెచ్చుకున్న ఓ గుడ్డలో కుమారుడి శరీర భాగాలను సేకరించిన నీరూయాదవ్‌ ఆ మూటను చేతి సంచిలో వేసుకొని ఏడ్చుకుంటూ తన గ్రామానికి కాలినడకనే పయనమయ్యాడు. అతడు రోడ్డు మీద విలపిస్తూ వెళుతుంటే దారినపోయేవారు ఆరా తీశారు. వారు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కాథైర్‌ డీఎస్పీ విచారణకు ఆదేశించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని