Coronavaccine: కేంద్రాల వద్ద బారులు
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronavaccine: కేంద్రాల వద్ద బారులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది. రెండో డోస్‌ వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పంపిణీ కేంద్రాల వద్ద జనం బారులుదీరారు. ప్రజల రద్దీకి సరిపడినన్ని టీకాలు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది కొంతమందికే టోకెన్లు ఇచ్చి మిగతావారిని వెనక్కి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌ యూపీహెచ్‌సీ వద్ద టీకాల కోసం జనం పోటెత్తారు. అమీర్‌పేట్‌ పీహెచ్‌సీ వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. రెండో డోసు కోసం భారీగా ప్రజలు తరలిరాగా.. 200 మందికి కొవిషీల్డ్‌, 150 మందికి కొవాగ్జిన్‌ ఇవ్వనున్నట్లు వైద్యాధికారి రేవతి వెల్లడించారు.
ఉప్పల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ జనం బారులుదీరారు. ఇక్కడ ఉదయం నుంచి టీకాల కోసం ప్రజలు క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం జిల్లాల్లోనూ భారీగా జనం తరలివస్తున్నారు. నిజామాబాద్‌లోని రెండు కేంద్రాల్లో మాత్రమే కొవాగ్జిన్‌ అందుబాటులో ఉండగా.. వినాయక్‌నగర్‌, పోలీస్‌ కాలనీల్లో టీకాల పంపిణీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 42 కేంద్రాల్లో, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 78, రాజన్న సిరిసిల్లా జిల్లాలో 5 కేంద్రాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌..

నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 78 వేల మందికి టీకాలు వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,16,857 మందికి తొలి డోస్ వ్యాక్సిన్‌ అందించారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు 1,37,476 మందికి టీకా పంపిణీ చేశారు. ఇక్కడ 20 వేల మందికి తొలి డోస్ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇంకా 1,10,370 మందికి రెండో డోస్‌ ఇవ్వాలని అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 65 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. వారిలో లక్షా 41 వేల మందికి తొలి డోస్‌ టీకా వేశారు. ఇక్కడ 23 వేల మందికి రెండో డోసు టీకా ఇచ్చారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 12,326 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. 75,911 మందికి రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో 89 వేల మందికి రెండో డోసు టీకా ఇవ్వాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లాలో ఈ నెల 12 నుంచి కొవాగ్జిన్‌ రెండో డోస్‌ పంపిణీ చేయనున్నారు. జూన్‌ 3 నుంచి కొవిషీల్డ్‌ రెండో డోసు అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని