close

తాజా వార్తలు

Updated : 18/10/2020 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాగ్యనగరంపై పగబట్టిన వరుణుడు

హైదరాబాద్‌: భాగ్యనగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షం నుంచి నగరవాసి కోలుకోక ముందే మరోసారి వరుణుడు నగరంపై పంజా విసిరాడు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురి చేసింది. విద్యుదాఘాతంతో మలక్‌పేటలో ఒకరు, సికింద్రాబాద్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన రహదారులపై నీరు నిలవటంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తడం, చెట్లు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మూసారాంబాగ్‌, ఫల్‌నుమా బ్రిడ్జిలపై వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం మజీద్‌పూర్‌ వద్ద కారు వరదనీటిలో చిక్కుకు పోయింది. స్థానికులు, పోలీసుల సాయంతో కారులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీశారు.

 మాదాపూర్, నానక్ రామ్‌గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షానికి ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని తెరిచి వాహనాలను అనుమతించారు. శని, ఆదివారాల్లో సందర్శకులను మాత్రమే అనుమతిస్తుండగా.. నగరంలో వరదల నేపథ్యంలో వారం వాటు ఈ సదుపాయం ఉండదని అధికారులు తెలిపారు. మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.  విజయవాడ-హైదరాబాద్ హైవే, హైదరాబాద్ - బెంగళూరు హైవేలపై వర్షపు నీరు చేరడంతో వాహనాలు చాలా నెమ్మదించాయి. బెంగళూరు - హైదరాబాద్ వెళ్లే వాహనాలను బాహ్యవలయ రహదారి గుండా మళ్లించారు. 

మరో మూడు రోజులపాటు వర్ష సూచన
మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలో కురుస్తోన్న వర్షాలు చివరి రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.  మరో రెండు రోజుల పాటు నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.