పురపోరుపై రిట్‌ పిటిషన్లు.. కొట్టేసిన హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 02/03/2021 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పురపోరుపై రిట్‌ పిటిషన్లు.. కొట్టేసిన హైకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికలకు న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. పురపాలక సంఘాల ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ దాఖలైన రిట్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఇప్పుడు కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషనర్లు వాదించారు. ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అప్పీళ్లను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై దాఖలైన నాలుగు లంచ్‌ మోషన్‌ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని