ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 16/03/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది.

ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది. గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో  విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదన్న పిటిషనర్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు.. గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని