చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం 
close

తాజా వార్తలు

Updated : 01/03/2021 09:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం 

చిత్తూరు : తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో తెదేపా నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు. దీంతో పాటు తెదేపా నేతల ఇళ్ల వద్ద నోటీసులు అంటించారు. 

పోలీసుల అదుపులో నర్సింహయాదవ్‌
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరారు. 
ఆయన కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో తెదేపా నేతలు అక్కడికి తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో తెదేపా నేత నర్సింహ యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్‌కు ఆయనను తరలించారు. చంద్రబాబు రానున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.  

అనుమతి నిరాకరణ.. 

చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహ కూడలిలో ఇవాళ నిర్వహించనున్న తెదేపా నిరసన కార్యక్రమానికి అనుమతిని నిరాకరిస్తూ చిత్తూరు పోలీసులు ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఉత్తర్వులు ఇచ్చారు. నగరంలోని ఐదువేల మంది తెదేపా కార్యకర్తలతో నిరసన చేపట్టనున్నామని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయాలని తెదేపా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు పులివర్తి నాని పోలీసులకు విన్నవించారు.  ‘కొవిడ్‌ దృష్ట్యా అంతమందితో కార్యక్రమం చేపట్టేందుకు కుదరదు. నగరపాలక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున అనుమతిచ్చేది లేదు’ అని డీఎస్పీ చెప్పారు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని